బాయ్‌ఫ్రెండ్ ఫాదర్‌ను పెళ్లిచేసుకున్న లేడీ.. మరీ ఇంత త్యాగమా?

187

దిశ, ఫీచర్స్: సాధారణంగా ప్రేమికులెవరైనా జీవితాంతం కలిసి బతకాలని కోరుకుంటారు. అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని ఒక్కటవుతారు. ఒకవేళ సాధ్యం కాకపోతే పార్ట్‌నర్ క్షేమాన్ని తలిచి త్యాగానికైనా సిద్ధపడతారు. కానీ ఇక్కడొక అమ్మాయి మాత్రం ప్రియుడి కోసం ఏకంగా అతని తండ్రినే వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది.

టిక్ టాక్ యూజర్@ys.amriకి ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. రీసెంట్‌గా అతని తల్లి చనిపోవడంతో బాధలో కూరుకుపోయాడు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలవాలనుకున్న గర్ల్‌ఫ్రెండ్.. ఏదో ఒకటి చేయాలనుకుంది. ఈ క్రమంలోనే బాయ్‌ఫ్రెండ్ తండ్రిని పెళ్లి చేసుకుని అతనికి తల్లి కాగలిగింది. ‘నా బాయ్‌ఫ్రెండ్ తల్లి చనిపోయింది. అతను బాధపడటం నాకు ఇష్టం లేదు. అందుకే నా బాయ్‌ఫ్రెండ్ మళ్లీ తల్లిని పొందాలని అతని తండ్రిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని వివరించింది. దీంతో చాలా మంది నెటిజన్లు ఆమె త్యాగాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు ఆమె నిర్ణయంతో ఆశ్చర్యపోతున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..