- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలుణ్ని చంపి, రక్తం రాసుకున్న పిన్ని
<p>దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా చిలకలూరిపేట లింగంగుంట్ల గ్రామంలో దారుణ ఘటన జరిగింది. పిన్ని వరసయ్యే ఓ మహిళ ఏడేళ్ల బాలుడిని అతికిరాతకంగా హతమార్చింది. వివరాల్లోకి వెళితే… లింగంగుంట్ల కు చెందిన ఓ మహిళ శుభకార్యానికి వెళుతూ… తన ఏడేళ్ళ కొడుకు కరీముల్లాని చెల్లెలు ఆసియా వద్ద వదిలి వెళ్లింది. ఈ నేపథ్యంలో బాలుడిని దారుణంగా హత్య చేసింది ఆ పిన్ని. బాలుడి గొంతు నుండి పొట్ట వరకు కోసి హతమార్చింది. అనంతరం రక్తాన్ని ముఖానికి రాసుకుని బయటకు పరుగులు పెట్టింది. అడ్డొచ్చిన స్థానికులపై కత్తితో దాడికి దిగింది. దీంతో ఆమె చేతులు కట్టేసి […]</p>

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా చిలకలూరిపేట లింగంగుంట్ల గ్రామంలో దారుణ ఘటన జరిగింది. పిన్ని వరసయ్యే ఓ మహిళ ఏడేళ్ల బాలుడిని అతికిరాతకంగా హతమార్చింది. వివరాల్లోకి వెళితే… లింగంగుంట్ల కు చెందిన ఓ మహిళ శుభకార్యానికి వెళుతూ… తన ఏడేళ్ళ కొడుకు కరీముల్లాని చెల్లెలు ఆసియా వద్ద వదిలి వెళ్లింది.
ఈ నేపథ్యంలో బాలుడిని దారుణంగా హత్య చేసింది ఆ పిన్ని. బాలుడి గొంతు నుండి పొట్ట వరకు కోసి హతమార్చింది. అనంతరం రక్తాన్ని ముఖానికి రాసుకుని బయటకు పరుగులు పెట్టింది. అడ్డొచ్చిన స్థానికులపై కత్తితో దాడికి దిగింది. దీంతో ఆమె చేతులు కట్టేసి బంధించారు స్థానికులు. తరువాత పోలీసులకు, బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చిన బాలుడి తల్లిదండ్రులు… కిరాతకంగా చంపబడ్డ తమ కుమారుని చూసి కూలబడ్డారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు చావుతో వారి రోదనలు మిన్నంటాయి. కాగా ఆసియాకు కొంతకాలంగా మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






