- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటోను ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి
<p>దిశ, డోర్నకల్ : ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం యల్లంపేట గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్ఐ బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మామిళ్లగూడానికి చెందిన గట్ల లక్ష్మయ్య రమాదేవి దంపతులు మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారం గ్రామంలోని బంధువుల ఇంట్లో దశదిన కర్మ కార్యక్రమానికి ఆటోలో తెల్లవారుజామున బయల్దేరారు. ఈ క్రమంలో ఆటో ఎల్లంపేట గ్రామ శివారులోకి రాగానే […]</p>

దిశ, డోర్నకల్ : ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం యల్లంపేట గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్ఐ బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మామిళ్లగూడానికి చెందిన గట్ల లక్ష్మయ్య రమాదేవి దంపతులు మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారం గ్రామంలోని బంధువుల ఇంట్లో దశదిన కర్మ కార్యక్రమానికి ఆటోలో తెల్లవారుజామున బయల్దేరారు.
ఈ క్రమంలో ఆటో ఎల్లంపేట గ్రామ శివారులోకి రాగానే బోధన్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఏపీ25 ఎక్స్ 6478 నంబర్ లారీ.. ఆటోను ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమాదేవి(55) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త లక్ష్మయ్యకు తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.






