- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళను ఢీకొట్టి పరారైన కారు.. వెంబడించిన పోలీసులు షాక్…
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలోని కశింకోట మండలం ఎన్.జి.పాలెంలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు రోడ్డుపై ఉన్న మహిళను ఢీకొట్టి డివైడర్ ఎక్కింది. దీంతో ఆ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. సదరు మహిళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తి ఆ కారును ఆపేందుకు ప్రయత్నించగా కారులో ఉన్న దుండగులు సదరు వ్యక్తిని కత్తితో బెదిరించి ఎలమంచిలి వైపు పరారయ్యారు. ఈ క్రమంలో కశింకోట పోలీసులకు సమాచారం అందించడంతో కారును వెంబడించి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలోని కశింకోట మండలం ఎన్.జి.పాలెంలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు రోడ్డుపై ఉన్న మహిళను ఢీకొట్టి డివైడర్ ఎక్కింది. దీంతో ఆ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. సదరు మహిళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తి ఆ కారును ఆపేందుకు ప్రయత్నించగా కారులో ఉన్న దుండగులు సదరు వ్యక్తిని కత్తితో బెదిరించి ఎలమంచిలి వైపు పరారయ్యారు. ఈ క్రమంలో కశింకోట పోలీసులకు సమాచారం అందించడంతో కారును వెంబడించి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా గంజాయి మూటలు దొరకడంతో స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






