విషాదం: ప్రేమ పెళ్లి.. పండగకని పుట్టింటికి వచ్చి.. చివరికి ఇలా

204

దిశ, జవహర్ నగర్: మేడ్చల్ లో విషాదం చోటుచేసుకొంది. పండగ కని పుట్టింటికి వచ్చిన వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకొని మొదటిసారి తల్లి దగ్గరికి వచ్చిన ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకి వెళితే.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 17వ డివిజన్ కు చెందిన దివ్య (21) అనే యువతి, రోహిత్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అయితే పెళ్లైన తర్వాత వచ్చిన వినాయక చవితి పండగ కావడంతో ఐదు రోజుల క్రితం భర్త రోహిత్ తో కలిసి తన తల్లి ఇంటికి వచ్చింది.

అందరు పండగ బాగా జరుపుకొని సంతోషంగా ఉన్నారు.  ఈ  నేపథ్యంలోనే బుధవారం తెల్లవారుజామున దివ్య అనుమానాస్పదంగా మృతిచెందింది. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు  చేస్తున్నారు. అయితే దివ్య మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. సహజంగానే దివ్య మృతిచెందిదా..? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..