- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
<p>దిశ వెబ్ డెస్క్: అశ్వారావు పేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం…నారావారి గూడెనికి చెందిన అలివేలు మంగకు ఒడ్డుపాలెం గ్రామానికి చెందిన గణప వెంకన్నతో పదేండ్ల క్రితం వివాహం జరిగింది. కాగా వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత భర్త నుంచి ఆమె విడిపోయింది. ఈ క్రమంలోనే జలవాగు గ్రామానికి చెందిన పూనం శ్రీనుతో సహజీవనం చేస్తుంది. వీరిద్దరు కలిసి జమ్ముగూడెంలో ఉంటున్నారు. అయితే గురువారం ఉదయం ఇంట్లో […]</p>

X
దిశ వెబ్ డెస్క్: అశ్వారావు పేటలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం…నారావారి గూడెనికి చెందిన అలివేలు మంగకు ఒడ్డుపాలెం గ్రామానికి చెందిన గణప వెంకన్నతో పదేండ్ల క్రితం వివాహం జరిగింది. కాగా వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత భర్త నుంచి ఆమె విడిపోయింది. ఈ క్రమంలోనే జలవాగు గ్రామానికి చెందిన పూనం శ్రీనుతో సహజీవనం చేస్తుంది. వీరిద్దరు కలిసి జమ్ముగూడెంలో ఉంటున్నారు. అయితే గురువారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమెను శ్రీనే చంపి ఉంటాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Next Story






