యూఎస్ క్యాపిటల్ భవనంలో కాల్పులు

by  |
యూఎస్ క్యాపిటల్ భవనంలో కాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ గెలుపును ధృవీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశమైంది. కాగా, జోబైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారుల ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఘర్షణ వాతావరణంతో బైడెన్ గెలుపు ధృవీకరణ ప్రక్రియకు ఆటంకం కలిగింది. ట్రంప్ ఆదేశాలతో
కేంద్ర బలగాలను రంగంలోకి దింపినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఆందోళనకారులు శాంతియుతంగా వ్యవహరించాలంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. తన మద్దతుదారులు పోలీసులకు సహకరించాలని ట్రంప్ పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed