పాతబస్తీలో విషాదం: వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే తీవ్ర అస్వస్థతతో మహిళ మృతి

by Vadlamudi Anukaran |

<p>దిశ, చార్మినార్ : రెండు నెలల క్రితం మీర్‌పేట్‌లో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని మృతి చెందిన నర్సింహా రెడ్డి ఘటన మరువక ముందే, పాతబస్తీలో మరో సంఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి నుండి తమ ప్రాణాలను రక్షించుకోవాలనుకుని కొవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకుంది పుప్పాకుల పెంటమ్మ. మొదటి డోస్ సక్సెస్ కావడంతో రెండవ డోస్ ఎపుడు తీసుకోవాలన్న ఆరాటం పెంటమ్మ ను కానరాని లోకాలకు సాగనంపింది. రెండవ డోస్ కొవిషీల్డ్ తీసుకున్న [&hellip;]</p>

crime news
X

దిశ, చార్మినార్ : రెండు నెలల క్రితం మీర్‌పేట్‌లో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని మృతి చెందిన నర్సింహా రెడ్డి ఘటన మరువక ముందే, పాతబస్తీలో మరో సంఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి నుండి తమ ప్రాణాలను రక్షించుకోవాలనుకుని కొవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకుంది పుప్పాకుల పెంటమ్మ. మొదటి డోస్ సక్సెస్ కావడంతో రెండవ డోస్ ఎపుడు తీసుకోవాలన్న ఆరాటం పెంటమ్మ ను కానరాని లోకాలకు సాగనంపింది. రెండవ డోస్ కొవిషీల్డ్ తీసుకున్న కాసేపటికే నాకు కళ్ళు తిరుగుతున్నాయ్.. అంటూ బెడ్ మీద వాలింది పెంటమ్మ.. నిద్రలోనే పెంటమ్మ ప్రాణాలు విడవడంతో శనివారం సాయంత్రం పాతబస్తీ ఛత్రినాక లో విషాదం చోటు చేసుకుంది.

అప్పటి వరకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న తన అమ్మ వ్యాక్సిన్ తీసుకోవడం కారణంగానే మృతి చెందిందని, అనవసరంగా వ్యాక్సిన్ తీసుకుని అమ్మను దూరం చేసుకున్నామని పిల్లలు గుండేపగిలేలా రోదించడం కంటతడి పెట్టించింది. వివరాలలోకి వెళితే.. ఛత్రినాక ఉప్పుగూడకు చెందిన పుప్పాకుల పెంటమ్మ(50), ముత్తయ్యలు భార్యా భర్తలు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం. ముత్తయ్య గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ లేబర్ గా పని చేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇది ఇలా ఉండగా కరోనా మహమ్మారి నుండి తమ ప్రాణాలను రక్షించుకోవాలనుకుని పెంటమ్మ గత ఏప్రిల్ నెలలో మొదటి డోస్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంది.

ఫస్ట్ డోస్ సక్సెస్ కావడం.. రెండవ డోస్ మెసేజ్ శనివారం మధ్యాహ్నం 12.51గంటలకు అని వచ్చింది. దీంతో ఎంతో హుషారుగా ఘోరేకబర్ లోని వ్యాక్సిన్ సెంటర్ కు బయలు దేరింది. సెంకడ్ డోస్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకున్న అరగంట వరకు కూడా పెంటమ్మ డాక్టర్ల పర్యవేక్షణలో కూడా ఉన్నారు. వ్యాక్సిన్ కేంద్రం నుంచి ఇంటికి వచ్చిన కాసేపటికే కళ్ళు తిరుగుతున్నాయ్ అంటూ బెడ్ మీద పడుకుంది. ఎంత సేపటికి నిద్ర లేవకపోడంతో ఆమెను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఛత్రినాకలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story