రోడ్డుపైనే తల్లి, కూతురిపై అలా చేసిన యువతులు.. కేకలు వేయడంతో అక్కడి నుంచి పరార్

by Batti.Sumithra |   (  Updated:2021-12-02 06:15:44  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: కారులోంచి దిగిన ఇద్దరు మహిళలపై ఇద్దరు మహిళలతోపాటు పలువురు దాడి చేసిన ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరలవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం&#8230; షాలిమార్ బాగ్ లోని ఓ రెసిడెన్షియల్ కాలనీలో నవంబర్ 19న కారు దిగిన మహిళపై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆ మహిళ కూతురిపై కూడా ఇనుప రాడ్లు, కట్టెలతో దాడికి [&hellip;]</p>

Mumabai-CC-TV
X

దిశ, వెబ్ డెస్క్: కారులోంచి దిగిన ఇద్దరు మహిళలపై ఇద్దరు మహిళలతోపాటు పలువురు దాడి చేసిన ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరలవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాలిమార్ బాగ్ లోని ఓ రెసిడెన్షియల్ కాలనీలో నవంబర్ 19న కారు దిగిన మహిళపై ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన ఆ మహిళ కూతురిపై కూడా ఇనుప రాడ్లు, కట్టెలతో దాడికి పాల్పడ్డారు. వాళ్లు కొడుతుండడంతో ఆ తల్లి, కూతురు సహాయం కోసం కేకలు వేశారు. దీంతో వారంతా అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దాడికి పాల్పడినవారిని అరెస్ట్ చేశారు.

Next Story