- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా ఉందని సూసైడ్ నోట్ రాసి..
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని చంపేసింది. కళ్లముందు సగటు మానవుడు ఆపదలో ఉన్నా, కరోనా మహమ్మారి మూలగా సాయం చేయకుండా పోయింది. అంతేగాకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా ఇతరులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అంతేగాకుండా తాను ఆత్మహత్యకు పాల్పడేముందు తనకు కరోనా ఉందని, తన శవాన్ని ఎవరూ ముట్టుకోవద్దని సూసైడ్ నోట్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని చంపేసింది. కళ్లముందు సగటు మానవుడు ఆపదలో ఉన్నా, కరోనా మహమ్మారి మూలగా సాయం చేయకుండా పోయింది. అంతేగాకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా ఇతరులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అంతేగాకుండా తాను ఆత్మహత్యకు పాల్పడేముందు తనకు కరోనా ఉందని, తన శవాన్ని ఎవరూ ముట్టుకోవద్దని సూసైడ్ నోట్ రాసి పెట్టింది.
వివరాళ్లోకి వెళితే.. పుప్పల్‌గూడలోని ఆల్కాపూర్ టౌన్‌షిప్‌లో నివాసముంటున్న గోపిరెడ్డి శిల్పారెడ్డి (37)కి సుబ్బారెడ్డి అనే వ్యక్తితో 2008లో వివాహం అయ్యింది. భర్త ఆమెను వరకట్నం కోసం తరచూ వేధిస్తుండడంతో కొద్ది రోజుల క్రితం శిల్ప అతడిని వదిలేసి ఒంటరిగా జీవిస్తోంది. ఆదివారం రాత్రి ఆమె సూసైడ్ నోట్ రాసి తన ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పరీక్షల నిమిత్తం మృతదేహం నుంచి నమూనాలు సేకరించారు.






