చెరువులో దూకి మహిళ ఆత్మహత్య… భర్తే కారణం..!

by Batti.Sumithra |

<p>దిశ, బోధన్ : బోధన్ మండలంలోని కల్దుర్కీ గ్రామానికి చెందిన బోర్రోల్ల అర్చన (23) అనే మహిళా గ్రామ శివారులోని రామన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని బోధన్ రూరల్ ఎస్సై లోకం సందీప్ తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం&#8230; కల్దుర్కీ గ్రామానికి చెందిన బోర్రోల్ల గంగాధర్‌తో గత నాలుగు సంవత్సరాల క్రితం అర్చన వివాహం జరిగింది. గంగాధర్ మద్యపానానికి బానిసై భార్యను అనుమానంతో ఎవరితో మాట్లాడినా వేధింపులకు గురిచేసేవాడని పోలీసులు తెలిపారు. వేధింపులు భరించలేక [&hellip;]</p>

women suicide
X

దిశ, బోధన్ : బోధన్ మండలంలోని కల్దుర్కీ గ్రామానికి చెందిన బోర్రోల్ల అర్చన (23) అనే మహిళా గ్రామ శివారులోని రామన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని బోధన్ రూరల్ ఎస్సై లోకం సందీప్ తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… కల్దుర్కీ గ్రామానికి చెందిన బోర్రోల్ల గంగాధర్‌తో గత నాలుగు సంవత్సరాల క్రితం అర్చన వివాహం జరిగింది.

గంగాధర్ మద్యపానానికి బానిసై భార్యను అనుమానంతో ఎవరితో మాట్లాడినా వేధింపులకు గురిచేసేవాడని పోలీసులు తెలిపారు. వేధింపులు భరించలేక అర్చన ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తెలిపారు. అర్చనకు ఒక కుమారుడు ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామ నిర్వహించి పోస్ట్ మార్టం నిమిత్తం బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అర్చన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story