- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంట్లో కారం చల్లి.. కత్తులతో పొడిచి మహిళ దారుణ హత్య..
<p>దిశ, నిడమనూరు: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో కుటుంబ తగాదాలు భగ్గుమన్నాయి. ఏకంగా ఓ ఇంట్లోకి చొరబడి కళ్లల్లో కారం చల్లి కుటుంబంపై విచక్షణారహితంగా పొడిచారు. ఈ దారుణ ఘటన బొక్కమంతల పాడు గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. గ్రామస్తులంతా ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కమతం భిక్షమయ్య- అచ్చమ్మ కుమారుడు శివనారికి, అదే గ్రామానికి చెందిన జెల్లపల్లి సూర్యనారాయణ కుమార్తె శ్యామలకు ఎనిమిదేండ్ల క్రితం వివాహమైంది. […]</p>

దిశ, నిడమనూరు: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో కుటుంబ తగాదాలు భగ్గుమన్నాయి. ఏకంగా ఓ ఇంట్లోకి చొరబడి కళ్లల్లో కారం చల్లి కుటుంబంపై విచక్షణారహితంగా పొడిచారు. ఈ దారుణ ఘటన బొక్కమంతల పాడు గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. గ్రామస్తులంతా ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కమతం భిక్షమయ్య- అచ్చమ్మ కుమారుడు శివనారికి, అదే గ్రామానికి చెందిన జెల్లపల్లి సూర్యనారాయణ కుమార్తె శ్యామలకు ఎనిమిదేండ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక పాప జన్మించింది. కాగా, భార్యాభర్తల మధ్య పలుమార్లు ఘర్షణలు జరగగా నిడమనూరు, నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్లలో శ్యామల ఫిర్యాదు చేసింది. పెద్దమనుషుల పూచీకత్తుతో రాజీపడి ప్రస్తుతం వారిద్దరు సజావుగానే ఉంటున్నారు.
శివనారి మామ జెల్లెపల్లి సూర్యానారాయణ అతడి భార్య యశోద, కుమారుడు శివలు కలసి కారం, కత్తులతో శివనారి ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులపై కారం చల్లి, కత్తులతో విచక్షణా రహితంగా పొడిచి శివనారి తల్లి అచ్చమ్మ(55)ను దారుణంగా హతమార్చారు. భిక్షమయ్య, అతడి తల్లి నారమ్మ, శివనారిపై కూడా కత్తులతో పొడవడంతో తీవ్రగాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం వారు మిర్యాలగూడలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అచ్చమ్మ మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, నిందితులు ముగ్గురు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. నిడమనూరు ఎస్ఐ సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా, మిర్యాలగూడ కోర్టు రెండవ అదనపు సివిల్ న్యాయమూర్తి మాధవి ఆసుపత్రికి వెళ్లి బాధితుల నుంచి వాంగ్మూలం సేకరించారు.
- Tags
- crime






