బీజేపీ కౌన్సిలర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ.. రోజూ అలా చేస్తున్నాడనే..!

by Vadlamudi Anukaran |   (  Updated:2021-08-24 22:20:11  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి లేకి పనులకు పాల్పడ్డాడు. స్నేహం ముసుగులో స్పేహితుడి ఇంటికి వెళ్తూ అతడి భార్యను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. అతడి చేష్టలకు విసిగిన ఆ ఇల్లాలు ఆ ప్రజాప్రతినిధికి చెప్పు దెబ్బలతో సత్కారం చేసింది. ఆ ప్రజాప్రతినిధి బీజేపీ కౌన్సిలర్ కావడం గమనార్హం. ఈ ఘటన ఛత్తీస్ గఢ్‌లో చోటుచేసుకుంది. ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రంలోని బలోద బజార్‌కు చెందిన బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంతం కమలాకర్‌కు స్థానికంగా [&hellip;]</p>

Woman attacks
X

దిశ, వెబ్‌డెస్క్ : పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి లేకి పనులకు పాల్పడ్డాడు. స్నేహం ముసుగులో స్పేహితుడి ఇంటికి వెళ్తూ అతడి భార్యను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. అతడి చేష్టలకు విసిగిన ఆ ఇల్లాలు ఆ ప్రజాప్రతినిధికి చెప్పు దెబ్బలతో సత్కారం చేసింది. ఆ ప్రజాప్రతినిధి బీజేపీ కౌన్సిలర్ కావడం గమనార్హం. ఈ ఘటన ఛత్తీస్ గఢ్‌లో చోటుచేసుకుంది.

BJP councilor

ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రంలోని బలోద బజార్‌కు చెందిన బీజేపీ కౌన్సిలర్ సూర్యకాంతం కమలాకర్‌కు స్థానికంగా ఓ మిత్రుడు ఉన్నాడు. స్నేహం నటిస్తూ తరచూ స్నేహితుడి ఇంటికి వెళ్లే కమలాకర్.. అతడి భార్యపై కన్నేశాడు. ఆమెను లైంగికంగా వేధిస్తూ బలవంతం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి కూడా భర్త పట్టించుకోలేదు. ఈ క్రమంలో భర్తతో కలిసి వచ్చిన బీజేపీ కౌన్సిలర్ అతడి ఇంట్లోనే మందు పార్టీ చేసుకుంటూ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిత్తురాలైన ఆమె.. కౌన్సిలర్ కమలాకర్‌పై చెప్పుతో దాడి చేసింది. కౌన్సిలర్‌కు సహకరించిన భర్తనూ చెప్పుతో బుద్ధి చెప్పింది. ఇద్దరిని ఇంట్లోనే ఎడాపెడా బాదింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి:

అర్ధరాత్రి అత్తతో రాసలీలలు.. ఉదయం తలుపు తీసేసరికి అలా

తన రెండో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ సునీత.. ఆస్తికోసమేనంటూ

Next Story