తన రెండో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ సునీత.. ఆస్తికోసమేనంటూ

by  |
తన రెండో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ సునీత.. ఆస్తికోసమేనంటూ
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవసరం లేదు. ఆమె గానం అద్భుతం.. ఆమె స్వరం మధురం.. ఆమె పాడిన పాటలను వింటూ మరోలోకంలో విహరిస్తూ ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఆమె పర్సనల్ లైఫ్ కూడా తెరిచిన పుస్తకమే. 19 ఏళ్లకే వివాహం అయిపోయింది. ఇద్దరు పిల్లలు.. భర్తతో గొడవలు.. లీగల్ గా విడాకులు తీసుకొని ఇద్దరు పిల్లల బాధ్యతలను తీసుకుంది. ఇక ఇద్దరు పిల్లల బాధ్యత చూసుకుంటూ చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉన్న సునీత ఈ మధ్యే బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి రెండో వివాహం సంచలనంగా మారినా విషయం తెలిసిందే.

ఇద్దరు పిల్లలు ఉండగా రెండో పెళ్లి చేసుకోవడానికి బుద్ధి లేదా..? అని కొందరు.. ఎదిగి వచ్చిన ఆడపిల్లను ఇంట్లో పెట్టుకొని ఏం పనులు అని మరికొందరు.. డబ్బు కోసమే రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుందని మరికొందరు సునీతను ట్రోల్స్ చేశారు. ఇక ఇటీవల ఈ ట్రోల్స్ పై సునీత ఓపెన్ అయ్యింది. ఒక యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సునీత మాట్లాడుతూ “తనపై వస్తున్న ట్రోల్స్ చాలా బాధ కలిగించాయని, రామ్ ని తాను డబ్బు కోసం, ఆస్తుల కోసమే పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అసలు రామ్ కి ఎన్ని ఆస్తులు ఉన్నాయి..? అవి ఎక్కడ ఉన్నాయి..? నిజం చెప్పాలంటే ఆయన కంపెనీకి టర్నోవర్ ఎంత అనేది కూడా తెలియదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రామ్ తనను ఎంతో బాగా చూసుకొంటాడని తన పిల్లలు నమ్మి తనను పెళ్లికి ఒప్పించినట్లు తెలిపారు. ఆయన వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో జోక్యం చేసుకోనని తెలిపింది.


Next Story

Most Viewed