‘నాగబంధం’ ఓవర్‌సీస్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

by Pulgam srinivas |

'నాగబంధం' మూవీ ఓవర్సీస్ హక్కులను జీ స్టూడియోస్ దక్కించుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

‘నాగబంధం’ ఓవర్‌సీస్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ
X

దిశ, వెబ్ డెస్క్: అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా, నబా నటేష్ మరియు ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జూలై 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేస్తూ, థియేట్రికల్ హక్కుల విక్రయ ప్రక్రియను కొనసాగిస్తోంది.

ఇందులో భాగంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ హక్కులను కూడా సెల్ చేశారు. ‘నాగబంధం’ ఓవర్సీస్ రైట్స్‌ను జీ స్టూడియోస్ సంస్థ దక్కించుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి స్పందన అందుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి జునైద్ కుమార్, అభే సంగీతం అందిస్తుండగా, నిక్ స్టూడియోస్ ఇండియా బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవాంశ్ నామా ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Next Story