ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం: విరిగిపడిన బోయింగ్ విమానం చక్రాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-05 02:29:27  IST  )

లుఫ్తాన్సా బోయింగ్ 787 విమానం ముందు చక్రాల ల్యాండింగ్ గేర్ ఒక్కసారిగా విరిగిపడిన ఘటన జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.

ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం: విరిగిపడిన బోయింగ్ విమానం చక్రాలు
X

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ఉన్న భారీ ప్యాసింజర్ విమానంలో ఊహించని ప్రమాదం జరిగింది. లుఫ్తాన్సా (Lufthansa) ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ (Boeing 787-9 Dreamliner) విమానం ముందు భాగం చక్రాల ల్యాండింగ్ గేర్ (Nose Gear) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న పలువురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.

అయితే, ఆ ఫ్లైట్ ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు వెళ్లాల్సి ఉంది. ఎయిర్‌పోర్టు గేట్ వద్ద పార్క్ చేసి ఉండగా.. ప్రయాణికులను ఎక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్ లోపల, కింద విధులు నిర్వహిస్తున్న క్రూ మెంబర్స్, గ్రౌండ్ స్టాఫ్ చిక్కుకుని తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో రెస్కూ టీమ్ స్పాట్‌కు చేరుకుని అత్యవసర వాహనాల్లో క్షతగ్రాలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అసలు విమానం చక్రాల గేర్ ఎందుకు విరిగిపడిందనే కోణంలో ఉన్నతాధికారులు, విమానయాన భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి.

Next Story