అద్దెకు భార్యలు.. కూతుర్లకు ఫుల్ డిమాండ్.. ఎక్కడో తెలుసా..?

by  |
అద్దెకు భార్యలు.. కూతుర్లకు ఫుల్ డిమాండ్.. ఎక్కడో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం విభిన్న మతాలు, సంప్రదాయాలు, ఆచారాలకు పుట్టినిల్లు. కానీ, కొన్ని ప్రాంతాల్లో విచిత్ర ఆచారాలు అప్పుడప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. సాధారణంగా ఒక వివాహితతో పరాయి వ్యక్తి చనువుగా మాట్లాడితేనే క్యారెక్టర్ బ్యాడ్ అంటూ ముద్రవేస్తుంటారు. ఇక వివాహేతర సంబంధం కొనసాగిస్తే హత్య చేయడానికి సైతం వెనుకాడని మనుషులు ఉన్నారు. కానీ, కట్టుకున్న భార్యను లీజుకు ఇచ్చే సంప్రదాయలు, ఆచారాలు మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో కొనసాగుతున్నాయి. ఈ ఆచారం పేరే ధడిచా ప్రాథ.

ఎందుకిలా చేస్తారు..

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధడిచా ప్రాథ విపరీతంగా ఉంటుంది. బాగా డబ్బులు ఉన్నవాళ్లు, ఆస్తులు ఉన్నప్పటికీ భాగస్వామి దొరకని అగ్రవర్ణాల మగవారు.. ఇతరుల భార్యలను అద్దెకు తెచ్చుకుంటారు. నెల నుంచి ఏకంగా ఏడాది పాటు మరొకరి భార్యను అద్దెకు తీసుకుంటూ.. వారితో ఇంటి పనులతో పాటు, పడక సుఖం కూడా అనుభవిస్తారు. మొత్తానికి చెప్పాలంటే ఆ కుటుంబానికి ఆమె తాత్కాలిక కోడలిగా ఉంటూ ప్రతి ఒక్కరి బాగోగులు చూసుకోవాలి. పైగా సదరు వివాహిత భర్తలు ఇందుకు స్టాంపు పేపర్ల మీద సంతకాలు చేసి మరీ వ్యాపారం చేయడం గమనార్హం.

మధ్యవర్తుల ప్రమేయంతో..

ఒక వ్యాపారానికి భారీగా డిమాండ్ ఉంది అంటే అందులో మధ్యవర్తులే కీలకంగా వ్యవహరిస్తుంటారు. బడాబాబులతో పరిచయాలు చేసుకుంటూ మారుమూల గ్రామాల్లోని పేద ప్రజల కష్టాలను ఆసరాగా చేసుకుంటూ ఈ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన కుటుంబాల్లో ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ.. ఇష్టం లేకపోయిన తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంలేదని తెలుస్తోంది. ఇటీవల గుజరాత్‌లో కూడా ఇటువంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యవసాయ కూలీ తన భార్యను నెల రోజులకు ధనవంతుడికి లీజుకు ఇవ్వగా.. తన కూలీ కంటే పది రెట్లు ఎక్కువగా ఆదాయం వస్తోందని చెప్పాడు.

భార్యలే కాదు కూతుర్లతో కూడా..

ఇక కొన్ని కుటుంబాల్లో అయితే భార్యలను రూ. 5 వందల కంటే తక్కువకు అద్దెకు ఇచ్చిన సంఘటనలు ఉంటే.. మరి కొన్ని కుటుంబాల్లో కూతుర్లను రూ. 50 వేలకు అప్పగిస్తున్నారు. ఏది ఏమైనా.. అక్కడి వారికి ధడిచా ప్రాథ ఆనవాయితీగా వస్తోందని చెబుతున్నారు. మరి అద్దెకు వెళ్లే మహిళల పరిస్థితి ఏంటని పలువురు సోషల్ వర్కర్స్ ‌నిలదీస్తూనే ఉన్నా ఇటువంటి వ్యాపారాలు కొనసాగడం గమనార్హం.

ఆంటీ కోసం ఉరేసుకున్న యువకుడు.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం!


Next Story

Most Viewed