- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
LRS లేకున్నా ఇండ్ల నిర్మాణాలు..
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఎల్‌ఆర్ఎస్ లేకున్నా నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన ఉత్తర్వులు రాష్ట్ర మున్సిపల్ శాఖ జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు ఎల్‌ఆర్ఎస్‌కు దరఖాస్తులు చేయని వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం తాజా మార్గ నిర్ధేశకాల ప్రకారం.. ఆగస్టు 28కి ముందు రిజిస్ట్రేషన్ పూర్తయిన స్థలాలకు, ఎల్‌ఆర్ఎస్ అప్లయ్ చేయనివారు కూడా నిర్మాణాలకు అనుమతి కోరవచ్చు. ఎల్‌ఆర్ఎస్‌కు నిర్ధేశించిన ఛార్జీలతో పాటు 33 శాతం కంపౌండింగ్ ఫీజు, […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : ఎల్‌ఆర్ఎస్ లేకున్నా నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన ఉత్తర్వులు రాష్ట్ర మున్సిపల్ శాఖ జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు ఎల్‌ఆర్ఎస్‌కు దరఖాస్తులు చేయని వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం తాజా మార్గ నిర్ధేశకాల ప్రకారం.. ఆగస్టు 28కి ముందు రిజిస్ట్రేషన్ పూర్తయిన స్థలాలకు, ఎల్‌ఆర్ఎస్ అప్లయ్ చేయనివారు కూడా నిర్మాణాలకు అనుమతి కోరవచ్చు.
ఎల్‌ఆర్ఎస్‌కు నిర్ధేశించిన ఛార్జీలతో పాటు 33 శాతం కంపౌండింగ్ ఫీజు, ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 14 శాతం ఖాళీ స్థలం చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌ఆర్ఎస్‌పై ప్రభుత్వం వెనక్కి తగ్గిన నేపథ్యంలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్లికేషన్లు క్లియర్ చేయడంతో పాటు రెగ్యులరైజేషన్ ఆదాయం కోల్పోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.






