‘ముఖ్యమంత్రి వస్తే.. మేం చీకట్లో మగ్గాలా?’

513

దిశ, కాటారం: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి మంగళవారం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సదర్శించేందుకు హెలిక్యాప్టర్‌లో వచ్చారు. కాళేశ్వరం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సమీపంలో విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్‌కో ఆధికారులు గతంలోనే కరెంటు తీగలు అమర్చారు. అయితే ఈ విద్యుత్ స్తంబాలు హెలిక్యాప్టర్ ల్యాండింగ్‌కు ఇబ్బంది ఎదురవుతుందని భావించిన అధికారులు హుటాహుటిన మంగళవారం ఉదయం విద్యుత్ స్తంబాలను కూల్చి వేయించారు. దీంతో అన్నారం, చండ్రుపల్లి, నాగెపల్లి, మద్దులపల్లి, పల్గుల, కుంట్లం, కాళేశ్వరంలోని దుబ్బగూడెం గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

గతంలో కన్నెపల్లి పంప్ హౌజ్ దారిలో ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన అధికారులు ఇప్పుడు దానిని తొలగించారు. దీంతో స్థానిక గుండం చెరువు సమీపంలోని ప్రైవేటు వారికి చెందిన స్థలంలో రాత్రికి రాత్రి హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. దీంతో హెలిక్యాప్టర్ ల్యాండ్ అయ్యేందుకం ఆటంకంగా ఉన్నాయన్న కారణంతో మంగళవారం ఉదయం విద్యుత్ స్తంబాలను తొలగించారు. ముఖ్యమంత్రి వచ్చే హెలిక్యాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ఇబ్బందిగా ఉన్న కరెంటు పోళ్లను తొలగించడం వల్ల తాము చీకట్లో మగ్గాల్సి వస్తుందని ఆరు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..