- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల భాగస్వామ్యం లేకుంటే ఆగ్రహానికి గురికావాల్సిందే
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలను భాగస్వామ్యం చేయకుండా చేసిన ఏ చట్టమైనా జనాగ్రహానికి గురికావాల్సిందేనని వైఎస్సార్తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల శుక్రవారం ట్విట్టర్వేదికగా పేర్కొన్నారు. రైతులను భాగస్వామ్యం చేయకుండా, రైతుల అనుమానాలు తొలగించకుండా, రైతులకు భరోసా కల్పించకుండా, రైతుల నెత్తిన రుద్దిన చీకటి చట్టాలను ఇప్పడికైనా రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది రైతులు సాధించిన గొప్ప విజయమని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడ్డారు. సీఎం సార్కు లిక్కర్ అమ్మకాలపై […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజలను భాగస్వామ్యం చేయకుండా చేసిన ఏ చట్టమైనా జనాగ్రహానికి గురికావాల్సిందేనని వైఎస్సార్తెలంగాణ పార్టీ చీఫ్షర్మిల శుక్రవారం ట్విట్టర్వేదికగా పేర్కొన్నారు. రైతులను భాగస్వామ్యం చేయకుండా, రైతుల అనుమానాలు తొలగించకుండా, రైతులకు భరోసా కల్పించకుండా, రైతుల నెత్తిన రుద్దిన చీకటి చట్టాలను ఇప్పడికైనా రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇది రైతులు సాధించిన గొప్ప విజయమని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వంపై షర్మిల విరుచుకుపడ్డారు. సీఎం సార్కు లిక్కర్ అమ్మకాలపై ఉన్నంత శ్రద్ధ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో లేదని చురకలంటించారు. బార్లకు టెండర్లు పిలవడంలో ఉన్న సోయి నోటిఫికేషన్లు భర్తీ చేయడంలో లేదని ఫైరయ్యారు. తెలంగాణలో ఇంకెంతమంది నిరుద్యోగులు బలికావాలని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే నిరుద్యోగులను బలిపీఠం ఎక్కించడమేనా? జనాలను తాగుబోతులను చేయడమేనా అని విరుచుకుపడ్డారు.
- Tags
- Farmer Laws






