గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేయండి

by  |
గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేయండి
X

దిశ, సూర్యపేట: ప్రజల సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవిన్స్ డే నిర్వహిస్తామని, ఏమైనా సమస్యలు ఉంటే సోమవారం గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదు చేయాల జిల్లా ఎస్పీ భాస్కరన్ అన్నారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదు దారులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వెంటనే ఆదేశించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదులు పరిశీలించారు. భూ సంబంధిత సమస్యల్లో ఇరు వర్గాలు అంగీకార, సామరస్య ధోరణిలో ఉండాలని, సమస్యలను జటిలం చేసుకోవద్దని, సర్వే, రికార్డ్స్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

Next Story

Most Viewed