- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐఐటీ పూర్తయ్యే వరకు ఆర్థికసాయం అందజేస్తా : కేటీఆర్
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఐఐటీ పూర్తయ్యేవరకు పూర్తి ఆర్థికసాయం అందజేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండేళ్ల క్రితం ఐఐటీలో సీటు సాధించింది. అయితే పేదరికం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాలని కేటీఆర్‌ను కోరగా, రెండేళ్ల నుంచి ఆర్థికసాయం అందజేస్తూ వస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది, రానున్న సంవత్సరానికి సంబంధించిన ఐఐటీ ఫీజు మొత్తాన్ని బుధవారం […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : ఐఐటీ పూర్తయ్యేవరకు పూర్తి ఆర్థికసాయం అందజేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండేళ్ల క్రితం ఐఐటీలో సీటు సాధించింది. అయితే పేదరికం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును కొనసాగించేందుకు ఆర్థిక సహాయం చేయాలని కేటీఆర్‌ను కోరగా, రెండేళ్ల నుంచి ఆర్థికసాయం అందజేస్తూ వస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది, రానున్న సంవత్సరానికి సంబంధించిన ఐఐటీ ఫీజు మొత్తాన్ని బుధవారం ప్రగతి భవన్‌లో అంజలి కుటుంబానికి అందజేశారు. అంజలి చదువు, భవిష్యత్ ప్రణాళికల వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. తమ కూతురు ఐఐటీ విద్యకు సంబంధించిన పూర్తి ఆర్థిక సహాయాన్ని అందించడంపై అంజలి కుటుంబం ధన్యవాదాలు తెలిపారు.






