- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వైల్డ్ డాగ్’ షూటింగ్ షురూ..
<p>దిశ, వెబ్‌డెస్క్ : కింగ్ నాగార్జున మళ్లీ బిజీ అయిపోయాడు. మరోసారి తనదైన మార్క్ చూపించేందుకు ట్రై చేస్తున్నాడు. ‘మన్మథుడు 2’తో డిజాస్టర్ చవిచూసిన నాగ్.. ఆ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘వైల్డ్ డాగ్’ సినిమాకు కమిట్ అయ్యాడు. సినిమాలో ఎన్ఐఏ ఆఫీసర్‌గా కనిపించబోతున్న నాగ్ లుక్ అదిరిపోగా.. రెగ్యులర్ షూటింగ్ డీటెయిల్స్ త్వరలోనే చెప్తానని వివరించాడు. కాగా, సెప్టెంబర్ 3 నుంచి ‘వైల్డ్ డాగ్’ చిత్రీకరణ షురూ అయినట్లు తెలిపిన నిర్మాణ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : కింగ్ నాగార్జున మళ్లీ బిజీ అయిపోయాడు. మరోసారి తనదైన మార్క్ చూపించేందుకు ట్రై చేస్తున్నాడు. ‘మన్మథుడు 2’తో డిజాస్టర్ చవిచూసిన నాగ్.. ఆ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘వైల్డ్ డాగ్’ సినిమాకు కమిట్ అయ్యాడు. సినిమాలో ఎన్ఐఏ ఆఫీసర్‌గా కనిపించబోతున్న నాగ్ లుక్ అదిరిపోగా.. రెగ్యులర్ షూటింగ్ డీటెయిల్స్ త్వరలోనే చెప్తానని వివరించాడు.
కాగా, సెప్టెంబర్ 3 నుంచి ‘వైల్డ్ డాగ్’ చిత్రీకరణ షురూ అయినట్లు తెలిపిన నిర్మాణ సంస్థ మ్యాటినీ ఎంటర్‌టైన్మెంట్స్.. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కింగ్ నాగ్ కూడా చాలా రోజుల తర్వాత సినిమా షూటింగ్ అనుభవం బాగుందని ట్వీట్ చేశాడు. ఎల్లుండి ‘బిగ్ బాస్ 4’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు చెప్పాడు. నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకునే షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అహిషార్ దర్శకత్వంలో వస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో సయామీ ఖేర్, అలీ రెజా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.






