- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానిస్తున్నాడని.. రాత్రి సమయంలో భర్తను అలా చేసిన భార్య
<p>దిశ, వెబ్ డెస్క్: తనని చంపుతానన్న భర్త నిజంగానే చంపుతాడేమోనని అతడిని తన భార్యే చంపేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం మేరకు.. జిల్లాలోని ఫరూక్ నగర్ మండలానికి చెందిన ఓ వ్యక్తికి మద్యం తాగే అలవాటు ఉంది. అంతేకాదు.. అతనికి నేరచరిత్ర ఉంది. అతను ఓ కేసు విషయంలో జైలుకు పోయి వచ్చాడు. జైలు నుంచి వచ్చినప్పట్నుంచి ప్రతిరోజూ తాగొచ్చి అనుమానంతో భార్యను వేధించేవాడు. ఆదివారం రాత్రి కూడా తాగొచ్చి ఆమెను […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తనని చంపుతానన్న భర్త నిజంగానే చంపుతాడేమోనని అతడిని తన భార్యే చంపేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తెలిసిన సమాచారం మేరకు.. జిల్లాలోని ఫరూక్ నగర్ మండలానికి చెందిన ఓ వ్యక్తికి మద్యం తాగే అలవాటు ఉంది. అంతేకాదు.. అతనికి నేరచరిత్ర ఉంది. అతను ఓ కేసు విషయంలో జైలుకు పోయి వచ్చాడు. జైలు నుంచి వచ్చినప్పట్నుంచి ప్రతిరోజూ తాగొచ్చి అనుమానంతో భార్యను వేధించేవాడు. ఆదివారం రాత్రి కూడా తాగొచ్చి ఆమెను చంపుతానని బెదిరించి నిద్రపోయాడు. నిజంగానే తనను చంపుతాడేమోనని నిద్రిస్తున్న భర్తను భార్యే బండరాయితో కొట్టి చంపినట్లు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
- Tags
- farooq nagar
Next Story






