- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పనిమనిషితో భర్త రాసలీలలు… దీక్షకు దిగిన భార్య
<p>దిశ, పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని 8వ వార్డు సాయినగర్ కాలనీలో తన భర్తను తనకు వదిలిపెట్టాలంటూ ఒక భార్య దీక్షకు దిగడం చర్చనీయాంశంగా మారింది. తూర్పాటి బిక్ష్యం దంతలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన రామానుజమ్మకు మూడు దశబ్ధాల క్రితం పెళ్లి అయింది. ఐదుగురు సంతానం ఉన్నారు. సాఫీగా సాగుతున్న సంసారంలో పని మనిషి రూపంలో ఆ కుటుంబంలో కలకలం రేగింది. ఇంట్లోని పనిమనిషితో తన భర్త అక్రమసంబంధం పెట్టుకున్నాడని, […]</p>

దిశ, పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని 8వ వార్డు సాయినగర్ కాలనీలో తన భర్తను తనకు వదిలిపెట్టాలంటూ ఒక భార్య దీక్షకు దిగడం చర్చనీయాంశంగా మారింది. తూర్పాటి బిక్ష్యం దంతలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన రామానుజమ్మకు మూడు దశబ్ధాల క్రితం పెళ్లి అయింది. ఐదుగురు సంతానం ఉన్నారు. సాఫీగా సాగుతున్న సంసారంలో పని మనిషి రూపంలో ఆ కుటుంబంలో కలకలం రేగింది. ఇంట్లోని పనిమనిషితో తన భర్త అక్రమసంబంధం పెట్టుకున్నాడని, ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడని భార్య రామానుజమ్మ ఆరోపిస్తుంది.
పనిమనిషిని పెళ్లి చేసుకుని తనను, తన పిల్లలను భర్త పట్టించుకోవడం లేదని చెబుతోంది. తన భర్తను తనకు వదిలేయాలని ఆడిగితే పనిమనిషి దాడులు చేస్తుందని, పిల్లలను తన వద్దకు రాకుండా తనను ఒంటరి చేశారని భార్య ఆవేదన వ్వక్తం చేస్తుంది. గతంలో ఈ విషయంపై సఖీ కేంద్రంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, అధికారులు తన భర్త తన వద్దకు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. లేని పక్ష్యంలో ఆత్మహత్య శరణ్యమని రోదించింది.






