- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం: ప్రియుడితో రాసలీలలకు అడ్డొస్తున్నాడని భర్తను అక్కడికి తీసుకెళ్లి..
<p>దిశ, అచ్చంపేట : నిండు నూరేళ్లు భర్తతో కలిసి ఉంటానని ప్రమాణం చేసి ఒక్కటైన గృహిణి మరో వ్యక్తి మోజులో పడింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడు సహాయంతో హతమార్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేశవగుడ గ్రామానికి చెందిన మాణిక్యరావు (35) అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం శోభారాణి(31)తో వివాహమైంది. కొద్దిరోజులు సవ్యంగా నడిచిన వీరి కాపురంలో […]</p>

దిశ, అచ్చంపేట : నిండు నూరేళ్లు భర్తతో కలిసి ఉంటానని ప్రమాణం చేసి ఒక్కటైన గృహిణి మరో వ్యక్తి మోజులో పడింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడు సహాయంతో హతమార్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేశవగుడ గ్రామానికి చెందిన మాణిక్యరావు (35) అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం శోభారాణి(31)తో వివాహమైంది. కొద్దిరోజులు సవ్యంగా నడిచిన వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. శోభారాణి వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది. ప్రియుడితో కలిసి ఉండడానికి భర్త అడ్డు వస్తున్నాడని అనుకోని మాణిక్యరావును హత్యచేయడానికి శోభారాణి రెడీ అయ్యింది. ఇందుకు ప్రియుడు సాయం తీసుకుంది. ఈనెల 13వ తారీఖున నల్లమల అటవీ ప్రాంతానికి భర్తను తీసుకెళ్లి ప్రియుడితో కలిసి అతనిని హత్యచేసింది.
అనంతరం మృతదేహాన్ని కవర్లో చుట్టి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం హైదరాబాద్ -శ్రీశైలం ప్రధాన జాతీయ రహదారి మన్ననూర్ గ్రామం నిరంజన్ షావలి దర్గా సమీపంలో గల లోయలో పడేశారు. ఇక మాణిక్యరావు ఉన్నట్టుండి కనిపించకుండపోవడంతో బంధువులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిసి ఆమె కూడా వెళ్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో శ్రీశైలం, యాదయ్య అనే వ్యక్తులను అనుమానించి వారిని విచారించగా హత్యా ఉదంతం బయటపడింది. వారు ఇచ్చిన సమాచారంతో మృతదేహం పడేసిన స్థలానికి వెళ్లి వెతకగా మృతుడు మాణిక్యరావు మృతదేహం గుర్తుపట్టలేని విధంగా, పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.






