- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రక్తపు మడుగులో భార్య.. కనిపించకుండా పోయిన భర్త..!
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : ఖాజిపేట్ రైల్వే క్వాటర్స్ సమీపంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే మేకల శ్రీనివాస్ తన భార్య మేకల రమ గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హత్యకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉంటుందనే ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించేవాడు. దీంతో దంపతులిద్దరి మధ్య తరుచూ […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : ఖాజిపేట్ రైల్వే క్వాటర్స్ సమీపంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే మేకల శ్రీనివాస్ తన భార్య మేకల రమ గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హత్యకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉంటుందనే ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించేవాడు. దీంతో దంపతులిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






