- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకు గుజరాత్‌లో లాక్.. భర్తకు కొరివి పెట్టిన భార్య
<p>దిశ, మెదక్: అనారోగ్యంతో చనిపోయిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కన్న కొడుకు అందుబాటులో లేకపోవడంతో భార్య తలకొరివి పెట్టింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెల్దండి రాములు అనే వ్యక్తి అనారోగ్యంతో శనివారం అర్ధరాత్రి చనిపోయాడు. అతనికి భార్య, కొడుకు కనకయ్య ఉన్నాడు. అతను బతుకుదెరువు కోసం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు వెళ్లాడు. లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. దీంతో రాములుకు తలకొరివి […]</p>
దిశ, మెదక్: అనారోగ్యంతో చనిపోయిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కన్న కొడుకు అందుబాటులో లేకపోవడంతో భార్య తలకొరివి పెట్టింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెల్దండి రాములు అనే వ్యక్తి అనారోగ్యంతో శనివారం అర్ధరాత్రి చనిపోయాడు. అతనికి భార్య, కొడుకు కనకయ్య ఉన్నాడు. అతను బతుకుదెరువు కోసం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు వెళ్లాడు. లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. దీంతో రాములుకు తలకొరివి పెట్టేందుకు కొడుకు అందుబాటులో లేకపోవడంతో తన భార్య అంత్యక్రియలు నిర్వహించింది.కాగా, తన తండ్రి అంత్యక్రియలను కనకయ్య ఆన్‌లైన్‌లో వీక్షిస్తూ కన్నీరు మున్నీరయ్యాడు.ఈ ఘటన స్థానికంగా కలిచివేసింది. రాములు అంతక్రియలకు డబ్బులు లేకపోవడంతో దాతలు తలా కొంత సాయం చేశారు.
tags ; husband died, cremation done by wife, medak, husnabad






