- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాయంపేటలో విషాదం.. భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య
by Shyam |
<p>దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్తతో గొడవ పడిన భార్య తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని వసంతాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ముప్పారపు శ్రీలత(30)కు భర్త శ్రీనివాస్‌తో ప్లాటుకు సంబంధించిన ఇన్ట్సాల్మెంట్ డబ్బుల విషయంలో గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి గురైన శ్రీలత సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఓదెల రాజేందర్ […]</p>

X
దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్తతో గొడవ పడిన భార్య తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని వసంతాపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ముప్పారపు శ్రీలత(30)కు భర్త శ్రీనివాస్‌తో ప్లాటుకు సంబంధించిన ఇన్ట్సాల్మెంట్ డబ్బుల విషయంలో గొడవ జరిగింది. దీంతో క్షణికావేశానికి గురైన శ్రీలత సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఓదెల రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Next Story






