భర్త.. ప్రియురాలు.. ఓ దోశ

94

దిశ,వెబ్‌డెస్క్: మనోడు ఇంట్లో ఇల్లాలు.. వీధిలో ప్రియురాలు టైప్. బాగా ఆకలిగా ఉందని ప్రియురాలితో కలిసి దోశ తినేందుకు ప్రయత్నించాడు. చివరికి ఆ దోశే మన్మథుడిని ఊచలు లెక్కపెట్టేలా చేసింది. భార్య చేతిలో తన్నులు తినేదాకా వెళ్లింది.
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ‌శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. పైన చెప్పినట్లుగా భార్య సరిపోదన్నట్లు ప్రియురాల్ని మెయింటైన్ చేస్తున్నాడు.ఆ విషయం భార్యకు చూచాయిగా తెలుసు. అయితే భర్త ఓ రోజు ఆఫీస్‌కు వెళుతున్నానని చెప్పి ప్రియురాలతో కలిసి గుడికి వెళ్లాడు. దైవదర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ మన్మధుడికి ఆకలేసింది.రోడ్ పక్కన టిఫిన్ సెంటర్‌లో దోశ‌ప్లేట్ తీసుకొని  కారులో ఉన్న ప్రియురాలికి తినిపిస్తున్నాడు. అదే సమయంలో ఇంటి నుంచి భర్తను ఫాలో అవుతున్న భార్య.. భర్త నిర్వాకాానికి విస్తుపోయింది. కారులో తాపీగా కూర్చొని ప్రియురాలికి దోశ తినిపిస్తున్న భర్తను  తన అన్నలతో కలిసి బడితె పూజ చేసింది. తన్నుకుంటూ పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్లింది. పరాయి స్త్రీ మోజునుంచి తన భర్తను రక్షించి తనకు న్యాయం చేయాలని వేడకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను కటకటాల వెనక్కి నెట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..