- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య ఆధార్ కార్డు అడిగిందని.. గడ్డి మందు తాగి చివరికి..
<p>దిశ, దౌల్తాబాద్ : రాయపోల్ మండలం మంతూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఎస్ఐ మహబూబ్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మంతూర్‌కు చెందిన అంబాళ్ళ స్వామి (35) మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల ధాన్యం అమ్మిన డబ్బులు ఆయన అకౌంట్‌లో జమ అయ్యాయి. ఆ డబ్బులతో రోజూ మద్యం తాగుతున్నాడు. ఈ నెల 21న ఉదయం ఆధార్ కార్డు తీసుకెళ్లి తాగి ఇంటికి వచ్చాడు. ఇది గమనించిన భార్య […]</p>

X
దిశ, దౌల్తాబాద్ : రాయపోల్ మండలం మంతూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఎస్ఐ మహబూబ్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మంతూర్‌కు చెందిన అంబాళ్ళ స్వామి (35) మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల ధాన్యం అమ్మిన డబ్బులు ఆయన అకౌంట్‌లో జమ అయ్యాయి. ఆ డబ్బులతో రోజూ మద్యం తాగుతున్నాడు. ఈ నెల 21న ఉదయం ఆధార్ కార్డు తీసుకెళ్లి తాగి ఇంటికి వచ్చాడు. ఇది గమనించిన భార్య రేణుక అతన్ని ఆధార్ కార్డు ఇవ్వమని అడిగింది. దీంతో కోపం తెచ్చుకున్న అతను ఆధార్ కార్డు గట్టిగా విసిరేసి, ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ మేరకు మృతుని భార్య రేణుక ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహబూబ్ తెలిపారు.
Next Story






