కబ్జా భూముల వివరాలు ‘ధరణి’లో ఎందుకు చేర్చలేదు..

by  |
కబ్జా భూముల వివరాలు ‘ధరణి’లో ఎందుకు చేర్చలేదు..
X

దిశ, అంబర్ పేట్ : సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కబ్జాకోరు మంత్రులపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసీఆర్‌కు లేఖ రాసినట్లు వివరించారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో బహిరంగంగా ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకోకుండా కేవలం ఈటల రాజేందర్ పైన వేటు వేయడం కక్ష సాధింపు చర్యలో భాగమే అవుతుందని, ఆరోపణలు వచ్చిన వారిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని అన్నారు.

దేవాదాయ భూములను కూడా వదలకుండా కబ్జా చేశారని విమర్శించారు. కబ్జా భూముల వివరాలు ధరణిలో ఎందుకు చేర్చలేదని అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోకపోతే.. మంత్రులు ఆక్రమించిన భూముల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తుందని హెచ్చరించారు.



Next Story

Most Viewed