కోవిషీల్డ్ సూచన వెనుక అసలు విషయం చెప్పిన బీసీసీఐ

by  |
కోవిషీల్డ్ సూచన వెనుక అసలు విషయం చెప్పిన బీసీసీఐ
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా క్రికెటర్లు కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకునేందుకు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, చతేశ్వర్ పుజార, అజింక్య రహానేలతో పాటు వారి భార్యలు కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే బీసీసీఐ ఆటగాళ్లను కోవిషీల్డ్ మాత్రమే తీసుకోవాలని కోవాగ్జిన్ తీసుకోవద్దని చేసిన సూచన వివాదాస్పదంగా మారింది.

కాగా, దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని బీసీసీఐ వెల్లడించింది. కోవిషీల్డ్ అయినా కోవాగ్జిన్ అయినా రెండు డోసుల తీసుకోవడం తప్పని సరి. ప్రతీ డోసుకు 28 రోజుల గ్యాప్ ఉంటుంది. ఇంగ్లాండ్ వెళ్లనున్న క్రికెటర్లు మే నెలాఖరు దేశం విడిచిపెట్టనున్నారు. దీంతో వీరు రెండోడోస్ ఇక్కడ తీసుకోవడానికి వీలు లేదు. కోవిషీల్డ్ బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రా జెనకా వ్యాక్సిన్ ఫార్ములా ఆధారంగా తయారు చేసింది. కాబట్టి ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత రెండో డోస్ ఆక్స్‌ఫర్డ్ టీకా తీసుకునే వెసులు బాటు ఉన్నది. అయితే కోవాగ్జిన్ ఇండియాలో తయారైన టీకా.. అది ఇంగ్లాండులో అందుబాటులో ఉండదు. అందుకే బీసీసీఐ ఇంగ్లాండ్ వెళ్లే ఆటగాళ్లకు మాత్రమే కోవిషీల్డ్ వేసుకోమని సూచించిందని స్పష్టం చేసింది. ఇండియాలోనే ఉండే ఇతర ఆటగాళ్లు తమకు లభ్యమయ్యే టీకాలు వేయించుకోవచ్చని చెప్పింది.


Next Story

Most Viewed