ఒలంపిక్స్‌లో అర్హత సాధించిన భారత క్రీడాకారులు వీరే…

48

దిశ, స్పోర్ట్స్ : టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం కావడానికి సరిగ్గా ఆరు నెలల సమయం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఈ మహా క్రీడా సంగ్రామంలో పాల్గొనడానికి సిద్దమవుతున్నాయి. ఒలంపిక్స్‌ పతకాల పట్టికలో ఇండియా ఎప్పుడూ కింద స్థానంలోనే ఉంటుంది. ఒకప్పుడు హాకీ మనకు బంగారు పతకం తెచ్చిపెట్టేది. కాలక్రమేనా మనకు హాకీలో కూడా తీవ్రమైన పోటీ ఎదురై అసలు పతకాలు రావడమే గగనమైంది. ఇటీవల షూటింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్‌లలో పతకాలు వచ్చాయి.

ఈ సారి టోక్యోలో జరగబోయే ఒలంపిక్స్‌లో షూటింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్‌లలో పతకాలు తప్పక వస్తాయని భావిస్తున్నారు. అయితే ఆయా విభాగాల్లో ఇండియా నుంచి ఎవరెవరు అర్హత సాధించారనేది అసలు ప్రశ్న. కరోనా మహమ్మారి కారణంగా ఒలంపిక్స్ మాత్రమే కాకుండా క్వాలిఫయింగ్ టోర్నీలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో గత ఏడాది ఏప్రిల్ చివరి నాటికే అర్హత పొందాల్సిన చాలా మంది ఇప్పటికీ బెర్తులు కన్ఫార్మ్ చేసుకోలేదు. ఇప్పటి వరకు ఏయే క్రీడలో బెర్తులు దక్కాయి.. ఇంకా వేటిలో దక్కాల్సి ఉందనేది ఒకసారి పరిశీలిద్దాం.

షూటింగ్‌లో అర్హత సాధించిన వారు

10 మీటర్ల ఎయిర్ రైఫిల్(పురుషులు) : దీపక్ కుమార్, దివ్యాన్ష్ సింగ్ పన్వర్
50 మీటర్ల ఎయిర్ రైఫిల్(పురుషులు) : ఐశ్వరి తోమర్, సంజీవ్ రాజ్‌పుత్
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (పురుషులు ) : సౌరభ్ చౌదరి, అభిషేక్ వర్మ
స్కీట్ మెన్ : అంగద్ బజ్వా, మిరాజ్ ఖాన్
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (మహిళలు) : అంజుమ్ మౌద్‌గిల్, అపూర్తి చండేలా
50 మీటర్ల ఎయిర్ రైఫిల్ (మహిళలు) : తేజస్విని సావంత్
10 మీటర్లు ఎయిర్ పిస్టర్ (మహిళలు ): మను భాస్కర్, యశస్విని దేస్వల్
25 మీటర్లు పిస్టల్ (మహిళలు) : చింకీ యాదవ్, రాహీ సర్నోబత్

ఇంకా అర్హత సాధించాల్సిన వాళ్లు

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (మహిళలు) : ఎలవేనిల్ వలరివన్
25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ (పురుషులు ) : అనిష్ భన్వాలా

వీరిద్దరికీ 6 జూన్ 2021 నాటికి ఉండే ర్యాకింగ్ పాయింట్ల ఆధారంగా అర్హత లభిస్తుంది.

బ్యాడ్మింటన్ అర్హత సాధించిన వారు :

ఇండియా తరపున ఒక్క బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కూడా అర్హత సాధించలేదు.

అర్హత సాధించాల్సిన వాళ్లు :

పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, బి. సాయి ప్రణీత్, అశ్విని పొన్నప్ప, సాత్వీక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి

ఏప్రిల్ చివరి నాటికి సింగిల్స్‌లో టాప్ 16 ర్యాంకు, డబుల్స్‌లో టాప్ 8 ర్యాంకు ఉన్న వాళ్లు అర్హత సాధిస్తారు.

బాక్సింగ్ అర్హత సాధించిన వాళ్లు

51 కేజీలు (మహిళలు) :మేరీ కోమ్
60 కేజీలు (మహిళలు) : సిమ్రన్‌జిత్ కౌర్
69 కేజీలు (మహిళలు) : లావ్లీనా బార్గొహిన్
75 కేజీలు (మహిళలు ) : పూజా రాణి
52 కేజీలు (పురుషులు) : అమిత్ పంగాల్
63 కేజీలు (పురుషులు) : మనీష్ కౌశిక్
69 కేజీలు (పురుషులు) : వికాస్ క్రిషాన్
75 కేజీలు (పురుషులు) : ఆశిష్ కుమార్
91+ కేజీలు (పురుషులు) : సతీష్ కుమార్

అర్హత సాధించాల్సిన వాళ్లు

57 కేజీల విభాగంలో గౌరవ్ సోలంకి, కవీందర్ బిష్త్ అర్హత సాధించాల్సి ఉంది.

జూన్‌లో పారీస్‌లో జరిగే వరల్డ్ క్వాలిఫయర్స్ ద్వారా ఎంపిక జరుగుతుంది.

రెజ్లింగ్ అర్హత సాధించిన వాళ్లు

57 కేజీలు ఫ్రీ స్టైల్ (పురుషులు) : రవి దహియా
65 కేజీలు ఫ్రీ స్టైల్ (పురుషులు) : బజరంగ్ పునియా
74 కేజీలు ఫ్రీ స్టైల్ (పురుషులు) : దీపక్ పునియా
53 కేజీలు ఫ్రీ స్టైల్ (మహిళలు) : వినేష్ ఫొగట్

అర్హత సాధించాల్సిన వాళ్లు

58 కేజీలు ఫ్రీ స్టైల్ (మహిళలు) : సాక్షి మాలిక్

ఏప్రిల్ రెండో వారంలో జరిగే ఏసియన్ ఒలంపిక్ క్వాలిఫయర్స్, మే తొలి వారంలో జరిగే వరల్డ్ ఒలంపిక్ క్వాలిఫయర్ ద్వారా అర్హత సాధించే అవకాశం ఉంది.

టెన్నిస్ అర్హత సాధించిన వాళ్లు

ఇప్పటి వరకు ఒక్కరు కూడా అర్హత సాధించలేదు

అర్హత సాధించాల్సిన వాళ్లు

రోహన్ బోపన్న, సానియా మీర్జా, లియాండ్ర్ పేస్, దివిజ్ శరన్, అంకిత రైనా, పరాంజేష్ గుణేశ్వరన్, సుమిత్ నగల్

7 జూన్ 2021 నాటికి ఏటీపీ, డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో టాప్ 56 లోపు ఉంటే సింగిల్స్ విభాగంలో ఒలంపిక్స్‌కు అర్హత సాధిస్తారు. టాప్ 10 ర్యాంకింగ్ ఉన్న వాళ్లు డబుల్స్‌లో ఎవరినైనా ఎంచుకొని ఒలంపిక్స్ ఆడవచ్చు. కానీ తమ పార్ట్‌నర్ ర్యాంకు 300 లోపు ఉండాలి. ఇండియా నుంచి సింగిల్స్‌కు అవకాశం లభించడం కష్టమే.

ట్రాక్ అండ్ ఫీల్డ్ అర్హత సాధించిన వాళ్లు

జావెలిన్ త్రో (పురుషులు) – నీరజ్ చోప్రా, శివపాల్ సింగ్
20 కిలోమీటర్ల రేస్ వాకింగ్ (పురుషులు) – కేటీ ఇర్ఫాన్
20 కిలోమీటర్ల రేస్ వాకింగ్ (మహిళలు) – భావనా జాట్
3వేల మీటర్ల స్టెపుల్ చేజ్ (పురుషులు ) – అవినాష్ సాబెల్
4X400 మీటర్ల మిక్స్‌రిలే – ఇండియా టీమ్ పురుషులు

అర్హత సాధించాల్సిన వాళ్లు

హిమదాస్ (200 మీటర్లు), ద్యుతీ చంద్ (100 మీటర్లు), తేజ్‌పాల్ సింగ్ తోర్ (షార్ట్ పుట్), శ్రీశంకర్ (లాంగ్ జంప్), 4X400 మీటర్ల మిక్స్‌రిలే టీమ్ మహిళలు

29 జూన్ 2021లోపు వీళ్లు అర్హత సాధించాల్సి ఉంది.

టేబుల్ టెన్నిస్ అర్హత సాధించిన వాళ్లు

ఇంత వరకు ఎవరూ అర్హత సాధించలేదు

అర్హత సాధించాల్సిన వాళ్లు

ఆచంట శరత్ కమల్, సాతియన్, మనిక బత్రా.

జనవరి చివరి వారంలో పోర్చుగల్‌లో జరిగే వరల్డ్ క్వాలిఫయర్స్ పోటీల ద్వారా అర్హత సంపాదిస్తారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..