ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం.. బీఎన్ రెడ్డి నగర్‌లో వేగంగా అభివృద్ధి పనులు

by Batti.Sumithra |

ఎన్నో సంవత్సరాలుగా వరద నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల ప్రజలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఊరట కల్పిస్తోంది.

ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం.. బీఎన్ రెడ్డి నగర్‌లో వేగంగా అభివృద్ధి పనులు
X

దిశ, హస్తినాపురం : ఎన్నో సంవత్సరాలుగా వరద నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల ప్రజలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. ప్రతి వర్షాకాలంలో నీట మునిగే వీధులు, ఇళ్లలోకి చేరే వరద నీరు, రాకపోకలకు అంతరాయం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితికి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టింది. డివిజన్ పరిధిలో వర్షపు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, నాలాల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, నీటి నిల్వకు కారణమవుతున్న అడ్డంకుల తొలగింపు వంటి పనులను వేగవంతం చేస్తోంది. దీంతో ఏళ్ల తరబడి ప్రజలను వెంటాడిన వరద సమస్యకు పరిష్కారం లభిస్తోందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పి.గణేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అనేక కాలనీలు వరద ముప్పును ఎదుర్కొన్నాయని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్‌ను వరద రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని, బీఎన్ రెడ్డి నగర్ అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నామని పి. గణేష్ రెడ్డి అన్నారు.

Next Story