వెన్నుపోటుకు రెండేళ్లు.. కౌంటర్‌గా విజయోత్సవ ర్యాలీలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-04 09:03:55  IST  )

రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ టీడీపీ శ్రేణులు పరస్పర ర్యాలీలతో ఎదురుపడటంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.

వెన్నుపోటుకు రెండేళ్లు.. కౌంటర్‌గా విజయోత్సవ ర్యాలీలు
X
  • ఏపీలో వైసీపీ VS టీడీపీ

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ టీడీపీ శ్రేణులు పరస్పర ర్యాలీలతో ఎదురుపడటంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పరస్పర విమర్శలతో గొడవలు జరిగే ఆస్కారం ఉండటంతో పోలీసులు అలర్టయ్యారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ర్యాలీలకు పిలుపునిచ్చింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు - పవన్ కల్యాణ్ ల సంతకాలతో ఇచ్చిన బాండ్లను దగ్ధం చేయనున్నారు.

గుంటూరు, విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, నంద్యాల పట్టణాల్లో వైసీపీ వెన్నుపోటు ర్యాలీలు చేస్తుండగా.. టీడీపీ శ్రేణులు వారికి కౌంటర్ గా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. రెండు గ్రూపులు తారసపడటంతో పోలీసులు అప్రమత్తమై గొడవలు జరగకుండా రూటు మార్చారు. గుంటూరు ర్యాలీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి వాటిని అమలు చేయలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చేందుకు హామీలివ్వడం, వచ్చాక వాటిని అమలు చేయకుండా కాలం గడపడం చంద్రబాబుకు అలవాటేనని దుయ్యబట్టారు. తాము గుజ్జనగుంటలో కార్యక్రమం నిర్వహించాలని ముందే నిర్ణయించుకున్నామని, అక్కడ టీడీపీ నేతలు తమ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టేలా బ్యానర్లు ఏర్పాటు చేశారన్నారు. పైగా జగన్ దిష్టిబొమ్మను పోలీసులే దగ్గరుండి దగ్ధం చేయించారని మండిపడ్డారు. గతంలో తన ఇంటిపై దాడిచేసినవారంతా.. నేడు గుజ్జనగుంటలో హడావిడి చేశారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు మంచిదికాదని తెలిపారు.

Next Story