కొరోనిల్‌పై డబ్ల్యూహెచ్ఓ ట్వీట్.. వెంటనే స్పందించిన పతంజలి

by  |
కొరోనిల్‌పై డబ్ల్యూహెచ్ఓ ట్వీట్.. వెంటనే స్పందించిన పతంజలి
X

న్యూఢిల్లీ: పతంజలి తయారుచేసిన కొరోనిల్ ఔషధాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించలేదు. ఔషధానికి సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని పతంజలి సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేశాయి. కొవిడ్ 19కు చికిత్సగా తాము ఎటువంటి సంప్రదాయ ఔషధాన్ని సమీక్షించలేదని, అలాగే, సర్టిఫై కూడా చేయలేదని డబ్ల్యూహెచ్‌వో ట్వీట్ చేసింది. పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలక్రిష్ణన్ కూడా ట్విట్టర్‌లో స్పందిస్తూ డబ్ల్యూహెచ్‌వో వ్యాఖ్యను ధ్రువీకరించారు.

తమ ఔషధానికి కేంద్ర ప్రభుత్వ శాఖ డీసీజీఐ అనుమతినిచ్చిందని వివరణ ఇచ్చారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే తొలి ఔషధాన్ని పతంజలి సంస్థ కనుగొందని, దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిందనీ ఇటీవలే ట్వీట్లు, వార్తలూ వచ్చాయి. భారత ఆయుర్వేదానికి గర్వకారణమని పలు ట్వీట్లు వచ్చాయి. కానీ, తాజా వివరణలో తమ ఔషధానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా డీసీజీఐ ఫార్మాస్యూటికల్ ప్రాడక్ట్‌గా సర్టిఫికేట్ ఇచ్చిందని తేలింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్ సమక్షంలో కేంద్ర ఆయుష్ శాఖ ఈ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సర్టిఫికేట్‌తో 158 దేశాలకు సాధారణంగా ఒక ఔషధాన్ని ఎగుమతి చేసుకోవడానికి అవకాశం కలుగుతంది. కానీ, డబ్ల్యూహెచ్‌వోనే ఔషధాన్ని ఆమోదించి సర్టిఫై చేసినట్టు కాదని నిపుణులు చెప్పారు.

Next Story

Most Viewed