IPL మ్యాచ్‌లో ఓటమి.. టీమిండియా స్టార్ క్రికేటర్‌తో విడాకులు తీసుకోబోతున్న భార్య?

by Samataha |
IPL మ్యాచ్‌లో ఓటమి.. టీమిండియా స్టార్ క్రికేటర్‌తో విడాకులు తీసుకోబోతున్న భార్య?
X

దిశ, ఫీచర్స్ : ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే గతంలో ఐపీఎల్ ఫైనల్ విజేత జట్టులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా జట్టు ఈ సారి క్వాలిఫైర్స్ నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో ఈయన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఓ పుకారు నెట్టింట్లో తెగ షికారు చేస్తోంది. ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచారు.

హార్దిక్, నటాషాను ఓ హోటల్‌లో కలవడం వీరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. దీంతో కొన్ని రోజులు డేటింగ్‌లో ఉన్న వీరు తర్వాత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ వీరు పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాలు గడిచిపోతుంది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. అయితే తాజాగా వీరు విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం లేకపోలేదు. హార్దిక్ తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి పోస్ట్ పెట్టలేదు, కనీసం విష్ చేసిన సందర్భం కూడా లేకపోలేదు. దీంతో వీరి రిలేషన్‌లో చీలిక ఏర్పడింది. వీరు త్వరలో విడాకులు తీసుకోవడానిక రెడీ అవుతున్నారంటూ ముంబై మీడియాలో గుస గుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా వీరు ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండేవారు. కానీ ఈ మధ్య అది కూడా లేకపోవడంతో ఈ రూమర్స్ మరింత ఎక్కువ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు కూడా నటషా తన ఇన్ స్టా నుంచి హార్దిక ఫోటోలను మాత్రం తొలిగించలేదు. కాగా, ఇది రూమర్‌నా లేక నిజమో తెలియాలంటే వారు స్పందించాల్సిందే అంటున్నారు నెటిజన్స్. ఇక ఇదిలా ఉంటే ముంబై జట్టు ఫైనల్‌కి రాకపోవడానికి కారణం హార్దిక్, తన భార్యతో రిలేషన్ ఇష్యూనే అయిఉంటుంది. వారు విడాకులు తీసుకునే ఆలోచనలో ఉండటం వలన అతను గేమ్ పై ఫోకస్ చేయలేదని కొందరు ట్రోల్ చేస్తున్నారు.

Next Story

Most Viewed