పిల్లల్ని కనడానికి ఇష్టపడని కపుల్స్..తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడి..!

by Mamatha |
పిల్లల్ని కనడానికి ఇష్టపడని కపుల్స్..తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడి..!
X

దిశ,వెబ్‌డెస్క్:ఆధునిక జీవన శైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా యువత సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతున్నట్టు కొన్ని నివేదికలు వెల్లడించాయి. జనాభా పెరుగుదల రేటు పై దీని ప్రభావం పడినట్టు కొన్ని నివేదికలు వివరించాయి. అయితే పెళ్లైన కొత్త జంటలు మునుపటిలా సంతానంపై ఆసక్తితో లేరని, పెరుగుతున్న ఖర్చులే దీనికి ప్రధాన కారణమని మెజారిటీ నివేదికలు తేల్చి చెప్పాయి. నగరాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ మిగులుతున్న సంపాదన అంతంత మాత్రమేనని, దీంతో కొత్త జంటలు సంతానాన్ని వాయిదా వేయడం లేదా అసలే వద్దనుకోవడం చేస్తున్నట్టు ‘మింట్‌’ ఓ నివేదికలో వెల్లడించింది.

మన దేశంలో పిల్లలను కని, పెంచి, డిగ్రీ వరకు పేరెంట్స్ ఓక్కో బిడ్డపై సగటున రూ.75 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ‘ఎడ్యూ ఫండ్’ నివేదిక వెల్లడించింది. ఇంజనీరింగ్ బదులు మెడిసిన్ చదివితే రూ.95 లక్షలు, విదేశాలకు వెళితే రూ.1.5 కోట్లకు పైగా వ్యయం అవుతోందని తెలిపింది. ఈ భారీ ఖర్చులకు భయపడి కొత్త జంటలు పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. దీంతో జనాభా పెరుగుదలలో క్షీణత ఏర్పడుతోందని చెప్పింది. ఇది ఇలాగే కొనసాగితే, పనిచేయగల శ్రామిక శక్తి తగ్గిపోయి, వృద్ధుల జనాభా విపరీతంగా పెరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఉత్పాదకత తగ్గి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందన్న భయాలు సైతం మొదలయ్యాయి.

Next Story

Most Viewed