టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో.. సంస్థకు సంబంధం లేదు: ఎండీ సజ్జనార్

by Mahesh |
టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో.. సంస్థకు సంబంధం లేదు: ఎండీ సజ్జనార్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ నుంచి టీజీగా మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని కీలక సంస్థల, పేర్లు లోగోలను మారుస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ లోగోను మార్చినట్లు సోషల్ మీడియాలో కొత్త లోగో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్‌ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్‌. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

Click Here For Twitter Post..

Next Story

Most Viewed