కాజల్ అగర్వాల్ కోసం ఆ పని చేయనున్న బాలయ్య

by Prasanna |
కాజల్ అగర్వాల్ కోసం ఆ పని చేయనున్న బాలయ్య
X

దిశ, సినిమా: కాజల్ అగర్వాల్.. హీరోయిన్ గా తెరంగేట్రం చేసి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. పెళ్లి చేసుకున్న తర్వాత .. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికి కూడా ఆమె సినీ కెరీర్ కొనసాగిస్తోంది. తాజాగా సత్యభామ మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా కాజల్ కెరీర్‌లో పూర్తి భిన్నమైన చిత్రం అవుతుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. మేజర్ మూవీ సినిమా ద్వారా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు.

ఈ నెల 24న ఈ మూవీ ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ లాంచ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. బాలకృష్ణ ముఖ్య అతిథిగా రావడంతో సత్యభామ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. భగవంత్ కేసరి చిత్రంలో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కలిసి నటించారు. అయితే, ఈ సినిమాలో వీరిద్దరూ కలిసిన నటించిన సీన్స్ లేకపోవడం అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది.

బాలయ్య 109 చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుందని అనేక వార్తలు వస్తున్నాయి.ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సత్యభామ చిత్రంలో నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్‌లతో పాటు కాజల్ అగర్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

Next Story

Most Viewed