నగరంలో వెలుగులోకి వచ్చిన కొత్త తరహా మోసం

by  |
Hyderabad city
X

దిశ, కుత్బుల్లాపూర్: నగరంలో నయా మోసం వెలుగులోకి వచ్చింది. వైట్ కాలర్ మోసాలకు పాల్పడుతున్న సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ పద్మజ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం చెన్నమ్మ నగరం బెలగాం గ్రామానికి చెందిన దేవనగరి సత్యనారాయణ, పి ఎస్ రావు నగర్, దమ్మాయిగూడకు చెందిన ప్రేమ్ కిషోర్(48), వాయు శక్తి నగర్ కు చెందిన విశాల్ జి సక్పాల్, సుశాంత్ ప్రేమ్ దాస్ గౌరవ్ లు ఒక గ్రూపుగా మారారు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు, రియల్టర్లు, బిల్డర్లను మచ్చిక చేసుకుంటారు. వారి వద్ద ఉన్న నల్లధనాన్ని తీసుకుని 1:3 ఎక్కువగా ఇస్తామని నమ్మిస్తారు. చివరకు బాధితులు మోసపోవడం నల్లధనమని బయటకు చెప్పుకోకుండా ఉంటున్నారు.

అసలు వారు మోసం ఎలా చేస్తారంటే..

ఓ వ్యాపారవేత్తను కలిసి మీ బ్యాంక్ ఖాతా ఉన్నప్పటికీ స్విస్ బ్యాంక్ మాదిరిగా మన వద్దే మరో సెకండ్ ఖాతా తెరిచి డబ్బును వృద్ధి చేసుకునేలా పథకం పన్నుతారు. ఇందుకు గాను సత్యనారాయణ వద్ద రూ.1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఓ స్టీల్ ప్లాంట్ యజమాని తన పేరుపై పెట్టుబడి పెట్టి చనిపోయాడని నమ్మిస్తారు. వాటిని తీయాలంటే సెకండ్ ఖాతాదారులు కావాలని, అందుకు స్లాట్ బుక్ చేసుకునేందుకు రూ.18 లక్షలు ట్రాన్స్ ఫర్ చేయాలని సూచిస్తారు. టోకెన్ కు రూ.10 లక్షలు, ఖాతా రెంట్ కు రూ.28 లక్షలు, నెట్ బ్యాంకింగ్ ఇతరత్రా రూ.5 లక్షలు ఇవ్వాలని సూచిస్తారు. పత్రాలను ఎంట్రీ చేయడం లాంటి వాటి కోసం మరో రూ.5 లక్షలు తీసుకుంటారు. నమ్మేందుకు సత్యనారాయణ పేరుతో ఐసీఐసీఐ ఖాతాలో రూ.1000 కోట్లున్నట్లు మార్పులు చేయించిన పత్రాన్ని చూపుతారు. ఇదంతా ప్రేమ్ కిషోర్ ముందుండి నడిపిస్తారు. వారిని నమ్మేందుకు స్టార్ హోటళ్లలో మోసపోయే వారితో సమావేశం ఏర్పాటు చేస్తారు. ముఠాలోని వారంతా మాకు మంచి లాభాలు వచ్చాయని చెప్పించడం, మార్పులు చేసిన పత్రాలు చూపించడం వల్ల నమ్ముతున్నారు. ట్రాన్స్ ఫర్ ఎలా.. సత్యనారాయణ కు ఒక ఖాతా ఉండగా అందులోకి బాధితులు కొంత నగదు పంపగా సర్వర్ సమస్య ఉందని, పత్రాలు సరిగా లేవని మళ్లీ పంపించాలని మరోసారి లక్షల రూపాయలను ట్రాన్స్ ఫర్ చేయించుకుంటారు.

ఇలా పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని ఓ బిల్డర్ వద్ద కోటి రూపాయలకు పైగా మోసం చేసి తీసుకుని మొహం చాటేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియరంజన్ నాయక్, ప్రేమ్ కిషోర్ లను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అనంతరం నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఇలా మన రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లోనూ ఇలా చేసినట్లు చేసిన నేరాలను ఒప్పుకున్నారు. నిందితుల వద్ద రూ.1.31 కోట్ల నగదు, ఒక కారు, 3 సెల్ ఫోన్ లు, ఒక ల్యాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు.

నమ్మి మోసపోవద్దు : డీసీపీ పద్మజ

ప్రజలు ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. సులువైన మార్గంలో డబ్బులు వస్తున్నాయని ఆశించవద్దు. ఇలాంటివి జరుగుతున్నట్లు తెలిస్తే సమాచారం అందించాలి. ప్రస్తుతం ముగ్గురు మోసపోయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. కొందరు ముందుకు రావడం లేదు. అలాంటి వారు వచ్చి ఫిర్యాదు చేస్తే.. ఇలాంటి మోసాలను అడ్డుకట్ట వేయడం లో భాగస్వాములు కావాలన్నారు.

Next Story

Most Viewed