బంగారంపై లోన్ తీసుకుంటున్నారా.. అతి తక్కువ వడ్డీ ఇక్కడే..!

by Harish |   (  Updated:2021-12-06 06:47:00  IST  )

<p>దిశ, వెడ్‌డెస్క్ : అవసరానికి డబ్బు లేనప్పుడు తాకట్టు పెట్టడానికి ముందుగా గుర్తుకు వచ్చేది ఏదైనా ఉందా అంటే అది బంగారం మాత్రమే. చాలా మంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద బంగారాన్ని తాకట్టు పెట్టడం వలన వడ్డీ మీద చక్రవడ్డీ వేస్తూ అసలు కంటే ఎక్కువ వడ్డీని వసూలు చేస్తారు. మరి ఇలాంటి చక్రవడ్డీలు వేయకుండా అవసరానికి తక్కువ వడ్డీ రేటుతో మనకు [&hellip;]</p>

gold loan
X

దిశ, వెడ్‌డెస్క్ : అవసరానికి డబ్బు లేనప్పుడు తాకట్టు పెట్టడానికి ముందుగా గుర్తుకు వచ్చేది ఏదైనా ఉందా అంటే అది బంగారం మాత్రమే. చాలా మంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద బంగారాన్ని తాకట్టు పెట్టడం వలన వడ్డీ మీద చక్రవడ్డీ వేస్తూ అసలు కంటే ఎక్కువ వడ్డీని వసూలు చేస్తారు. మరి ఇలాంటి చక్రవడ్డీలు వేయకుండా అవసరానికి తక్కువ వడ్డీ రేటుతో మనకు బంగారంపై లోన్‌లు ఇచ్చే సంస్థ ఉందా అంటే అది బ్యాంకు మాత్రమే. అన్ని బ్యాంకులు ఒకే రకమైన వడ్డీ రేటుతో లోన్‌లు ఇవ్వవు. ఒక్కో బ్యాంకు ఒక్కో విధమైన వడ్డీ రేటుతో లోన్‌లు ఇస్తాయి.

బంగారు రుణాలకు డాక్యుమెంటేషన్ అవసరం కూడా తక్కువగా ఉంటుంది. అత్యవసర ఆర్థిక అవసరాన్ని తీర్చుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. బంగారానికి ఉన్న విలువ కారణంగా చాలా ఆర్థిక సంస్థలు బంగారంపై రుణాలను అందించడానికి ముందుకు వస్తున్నాయి. సాధారణంగా తాకట్టు పెట్టిన బంగారంపై మార్కెట్ విలువలో 75% వరకు గోల్డ్ లోన్ అందిస్తున్నారు. బంగారం ధరలు తగ్గితే, మీరు పొందే రుణం మొత్తం కూడా తగ్గుతుంది. కాబట్టి, గోల్డ్ లోన్ కోసం వెళ్లే ముందు, బంగారం ధరలను చెక్ చేయండి.

2 సంవత్సరాల కాలానికి రూ.5 లక్షల రుణానికి బ్యాంకులు ఏ విధమైన వడ్డీరేటు, EMI తో బంగారం పై లోన్‌లు ఇస్తున్నాయో కింద తెలుసుకుందాం.

అత్యధికంగా ఐసిఐసిఐ బ్యాంక్ రూ.5 లక్షల లోన్‌కి 2సంవత్సరాల కాలానికి 11.00%వడ్డీ, EMI రూ.23,304 వసూలు చేస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.5 లక్షల లోన్‌కి 2సంవత్సరాల కాలానికి, 7.25% వడ్డీ, EMI రూ.22,443 అవుతుంది. కెనరా బ్యాంక్ రూ.5 లక్షల లోన్‌కి 2సంవత్సరాల కాలానికి 7.35%వడ్డీ, EMI రూ.22,466. సెంట్రల్ బ్యాంక్ రూ.5 లక్షల లోన్‌కి 2సంవత్సరాల కాలానికి 8.85%, EMI రూ.22,808. అత్యల్పంగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రూ.5 లక్షల లోన్‌కి 2సంవత్సరాల కాలానికి 7.00%వడ్డీ, EMI రూ. 22,386. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.5 లక్షల లోన్‌కి 2సంవత్సరాల కాలానికి 7.00%, EMI రూ. 22,386 అవుతుంది.

బ్యాంకుల వారిగా చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్‌లో అత్యధికంగా వడ్డీ ఉంది. అత్యల్పంగా పంజాబ్ అండ్ సింధ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి. గోల్డ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నప్పుడు ముందు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ-క్లోజర్ చార్జీలు (వర్తిస్తే) మొదలైన వాటిని క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిది.

విడాకులు తీసుకోవడం సమంతకు ఇష్టం లేదా..? ఆ కామెంట్లకు అర్ధం ఏంటి..?

Next Story