- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'సీఎం డౌన్ డౌన్.. సీఎం డౌన్ డౌన్'
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 30న ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే.. బీహార్ లోని తారాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ కు కూడా ఈనెల 30న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో తమ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం అక్కడికి వెళ్లారు. కొంతమంది యువత ఆయనకు స్వాగతం పలికారు. కానీ, కొంతమంది యువత మాత్రం పెద్ద ఎత్తున […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 30న ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే.. బీహార్ లోని తారాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ కు కూడా ఈనెల 30న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. ఈ నేపథ్యంలో తమ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం అక్కడికి వెళ్లారు. కొంతమంది యువత ఆయనకు స్వాగతం పలికారు. కానీ, కొంతమంది యువత మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఫ్లకార్డులు పట్టుకుని మరీ.. ఉద్యోగాలు ఇస్తానన్నావ్ ఏమైంది…? మీరిస్తానన్న ఉద్యోగాలు ఎక్కడపోయాయి..? అని రాసి ఉన్న ఫ్లకార్డులను ఎత్తి చూపిస్తూ, ‘సీఎం డౌన్ డౌన్.. సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో తెగ వైరలవుతున్నాయి.
Next Story






