kajal Aggarwal :సినిమాలకు కాజల్ గుడ్ బై.. అతని మాట కోసమే వెయిటింగ్ అంట

by  |
kajal Aggarwal :సినిమాలకు కాజల్ గుడ్ బై.. అతని మాట కోసమే వెయిటింగ్ అంట
X

దిశ, వెబ్‌డెస్క్: ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో పక్కింటి అమ్మాయిలా తెలుగుతెరకు పరిచయమయ్యి, తన చందమామలాంటి ఫేస్ తో కుర్రకారు గుండెల్లో దేవతలా కొలువుండిపోయింది కాజల్ అగర్వాల్. కళ్లతోనే కుర్రకారు మనసు దోచేస్తున్న ఈ భామ 15 ఏళ్ళ కెరీర్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతూనే వస్తోంది. సీనియర్, జూనియర్ హీరోలతో జతకట్టి ఆడిపాడింది. ఇక గతేడాదే కాజల్ తన సోలో బ్రతుక్కి టాటా చెప్పి చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లాడి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇక హీరోయిన్ కి పెళ్లయ్యాక మళ్లీ సినిమాల్లో నటించాలంటే భర్త, అత్తమామల పర్మిషన్ తప్పనిసరి. అయితే, ఈ విషయంలో తాను అదృష్టవంతురాలినని అంటుంది చందమామ.

తన భర్త తనకు పూర్తి సపోర్ట్ ఇస్తాడని, తన కెరీర్ విషయంలో ఎప్పుడు జోక్యం చేసుకోడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా “నా భర్త ఎప్పుడైతే సినిమాలు స్టాప్ చేయాలనీ చెబుతారో.. ఆ వెంటనే సినిమాల్లో నటించడం ఆపేస్తా” అంటూ షాకింగ్ న్యూస్ చల్లగా చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం కాజల్ తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’, అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ సరసన ‘భారతీయుడు-2’ లో నటిస్తోంది. ఇక ఈ విషయం విన్న కాజల్ ఫ్యాన్స్ మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed