- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్ ఎదుట కత్రినాకు ప్రపోజ్ చేసిన హీరో
<p>దిశ, సినిమా : బీటౌన్ ఫిల్మ్ ఈవెంట్‌లో భాగంగా హీరో విక్కీ కౌశల్.. కత్రినాకు తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ ఎదుటే ప్రపోజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో క్లిప్ కొన్ని సంవత్సరాలం కిందటిది కాగా.. ‘విక్కీ కౌశల్ లాంటి నైస్ గయ్‌ను చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా? ఆల్రెడీ పెళ్లిల్ల సీజన్ నడుస్తోంది కాబట్టి అలా జరిగితే బాగుండు’ అని కత్రినాను అడిగాడు విక్కీ. ఆ తర్వాత వాట్? […]</p>

దిశ, సినిమా : బీటౌన్ ఫిల్మ్ ఈవెంట్‌లో భాగంగా హీరో విక్కీ కౌశల్.. కత్రినాకు తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ ఎదుటే ప్రపోజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో క్లిప్ కొన్ని సంవత్సరాలం కిందటిది కాగా.. ‘విక్కీ కౌశల్ లాంటి నైస్ గయ్‌ను చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా? ఆల్రెడీ పెళ్లిల్ల సీజన్ నడుస్తోంది కాబట్టి అలా జరిగితే బాగుండు’ అని కత్రినాను అడిగాడు విక్కీ. ఆ తర్వాత వాట్? అంటూ కత్రినా రిప్లయ్ ఇవ్వగా.. ‘ముజ్‌సే షాదీ కరోగీ’ అంటూ సల్మాన్ మూవీలోని పాట కూడా పాడాడు.
ఈ ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతున్నంత సేపు కెమెరాలన్నీ సల్మాన్ రియాక్షన్స్ క్యాప్చర్ చేయడం విశేషం. వీడియో మొదట్లో నవ్వుతూ కనిపించిన భాయ్‌జాన్.. చివరకు తన సిస్టర్ అర్పిత ఖాన్ భుజంపై వాలిపోయాడు. ఈ మేరకు విక్కీ కొద్దిసేపు కత్రినా రిప్లయ్ కోసం ఎదురుచూడగా.. ఆమె అంత ధైర్యం లేదని నవ్వుతూ చెప్పడంతో సల్మాన్ ఆశ్చర్యపోతూ లేచాడు. ఇదిలా ఉంటే.. ఏడాది కాలంగా విక్కీ, కత్రినా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇప్పటివరకు అఫిషియల్‌గా ప్రకటించకపోయినా.. లేటెస్ట్‌గా నటుడు హర్షవర్ధన్ రాణే వీరిద్దరి డేటింగ్‌ను కన్‌ఫర్మ్ చేసేశాడు.






