బద్ద శత్రువులైన బెస్ట్ ఫ్రెండ్స్.. ప్రియాంక, కంగన మధ్య ఏం జరిగింది.?

by  |
Priyanka,-kangana
X

దిశ, సినిమా : ప్రియంక చోప్రా, కంగనా రనౌత్.. ఈ పేర్లు తెలియని వారుండరు. 2008లో వీరిద్దరూ మధుర్ భండార్కర్ డైరెక్ట్ చేసిన ‘ఫ్యాషన్’ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ టైమ్‌లో ప్రియాంక పట్ల తనకున్న అడ్మిరేషన్‌ను ఓపెన్‌గా చెప్పిన కంగన.. ఇద్దరికి మంచి రిలేషన్‌షిప్ ఉన్నట్టు పేర్కొంది.

ఫ్యాషన్ సినిమా టైమ్‌లో తనను ఒక జూనియర్‌లా కాకుండా ఫ్రెండ్‌లా ట్రీట్ చేసేదని, అంతేకాదు తన గురించి పీసీ కన్నా ఎక్కువగా ఏ జర్నలిస్ట్‌కు కూడా తెలియదని గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ ఇప్పుడు తనను ‘సెక్యులర్ పప్పీ’ అని కామెంట్ చేసేంతగా వైరం పెరిగింది. కొన్నినెలల క్రితం ప్రియాంక పొలిటికల్ వ్యూస్‌ను కంగన బహిరంగంగా విమర్శించడంతో ఈ విభేదాలు ఇంకా ఎక్కువయ్యాయి.

2018లో ప్రియాంక.. నిక్ జోనాస్‌తో తన ఎంగేజ్‌మెంట్ వేడుకకు ఆహ్వానించకపోవడంతో కంగన అప్‌సెట్ అయింది. ఇదే క్రమంలో గతేడాది ఫార్మర్స్ ప్రొటెస్ట్స్ సందర్భంగా.. రైతులకు సంఘీభావం తెలుపుతూ ప్రియాంక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఈ విషయంలో ప్రియాంకతో విభేదించిన కంగన.. తనను ‘సెక్యులర్ పప్పీ’గా పోల్చింది. ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్న రైతుల నిరసనల్ని ప్రోతహించినందుకు లెఫ్ట్ మీడియా నుంచి ప్రశంసలు అందుతాయని వ్యంగ్యంగా కామెంట్ చేసింది.

Next Story

Most Viewed