RRR సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?

by  |
RRR సినిమా రిలీజ్ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా హాలీవుడ్, బాలీవుడ్ స్టార్ కాస్ట్ తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. రీసెంట్‌గా అవుట్ డోర్స్ లో షూటింగ్ కోసం వెళ్లొచ్చిన టీమ్ ఇప్పుడు సెట్స్ లోనే షూటింగ్ చేస్తున్నారు. మూడేళ్ల నుంచి టాలీవుడ్ హాట్ టాపిక్ గా ఉన్న ఈ సినిమా షూట్ ఏప్రిల్ నాటికి ఫినిష్ అయిపోతుందని యూనిట్ కి చెప్పారట రాజమౌళి.

ట్రిపుల్ ఆర్ సినిమా 2020 సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే అది అవ్వక 2021 జనవరికి పోస్ట్ పోన్ చేశారు. ఆ ఛాన్స్ కూడా లేకపోవడంతో 2021 సమ్మర్ అనుకుంటున్నారు. కానీ సమ్మర్ బరిలోకి కూడా సినిమా వచ్చేలా లేదు. ఏప్రిల్ కి షూటింగ్ ఫినిష్ చేసినా.. సి.జివర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో, రాజమౌళి ఇంకా సినిమాను చెక్కుతూనే ఉంటారు. అందుకే సినిమా సమ్మర్ లో కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.

సమ్మర్ లో రిలీజ్ అయినా కాకపోయినా .. హీరోలు చరణ్, ఎన్టీఆర్ మాత్రం ఏప్రిల్ నాటికి ఫుల్ ఫ్రీ అయిపోతారు. అసలే ఇద్దరూ ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్న సినిమాల్ని హోల్డ్ లో పెట్టి అటు డైరెక్టర్స్ ని ఇటు ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెట్టారు. అందుకే ఎప్పుడెప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ సినిమా షూట్ అయిపోతుందా, నెక్ట్స్ సినిమాల్ని కంప్లీట్ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. అందుకే ఏప్రిల్ నాటికి షూటింగ్ ఫినిష్ చేసుకుని దసరాకు ట్రిపుల్ ఆర్ సినిమాని రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట రాజమౌళి అండ్ టీమ్.


Next Story

Most Viewed