సూపర్‌ మార్కెట్‌లో ప్రిన్స్ సీక్రెట్ డేట్

by  |
Prince harry, Meghan markle
X

దిశ, ఫీచర్స్: ప్రిన్సెస్ డయానా కొడుకు ప్రిన్స్ హ్యారీ. నటి, హక్కుల ప్రచార కార్యకర్త బ్లాగర్ మేఘన్ మార్కల్‌ను 2018లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. హ్యారీని వివాహం చేసుకున్న తరువాత ఆమె డచెస్ ఆఫ్ సస్సెక్స్‌గా మారారు. ఆ దంపతులిద్దరూ కూడా రాజకుటుంబంలో విభేధాల వల్ల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఓప్రా విన్‌ఫ్రే ఇంటర్య్వూలో సంచలన విషయాలు బయటపెట్టిన ఆ జంట ఒక్కొక్కటిగా తమ సీక్రెట్స్ రివీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తొలిసారి వారి డేట్ గురించి ప్రిన్స్ హ్యారీ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ప్రిన్స్ హ్యారీ తన స్నేహితురాలైన మేఘన్ మార్కల్‌ 2016లో తొలిసారి లండన్ పర్యటించింది. ఈ సందర్భంగా ఇద్దరూ బయటకు వెళ్లినప్పుడు ఒకరికొకరు తెలియనట్లుగా పూర్తి అజ్ఞాత వ్యక్తులుగా వ్యవహరించాలని ఆమెతో ప్రిన్స్ హ్యారీ చెప్పాడట. ఇక ఆ ఇద్దరూ కలిసి ఓ సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేశారు. అందులోనే తిరుగుతూ ఒకరికొకరం చాటింగ్ చేసుకున్నాం. అందులో ఉన్న చాలామంది నన్ను చాలా వింతగా చూస్తూ.. హాయ్ చెప్పడానికి వచ్చారని చెప్పుకొచ్చాడు. ఏదైమైనా తాను మాత్రం టెక్ట్స్ ఆపలేదని తెలిపాడు. ‘మీ బేస్‌బాల్ క్యాప్ నేలవైపు చూస్తుంది. మీరు వీధిలో నడుస్తున్నప్పుడు ఇలా అజ్ఞాతంగా ఉండటానికి ఎన్నిసార్లు ప్రయత్నించారో నాకు తెలియదు. కానీ ఇది చాలా బాగుంది. ఎంతమంది షూస్ చూస్తున్నారు. ఆ కుక్క నీవైపే చూస్తుంది’ అంటూ మేఘన్ చేసిన మెసేజ్‌లను వివరించాడు.

ఇదిలా ఉంటే, ప్రముఖుల మైన‌పు విగ్రహాలు రూపొందించి వాటిని ప్ర‌త్యేక మ్యూజియంలో ఏర్పాటు చేసే మేడమ్ టుస్సాడ్స్ గురువారం ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కల్‌ల మైన‌పు బొమ్మ‌ల‌ను బ్రిట‌న్‌ రాయ‌ల్ కుటుంబం గ్రూప్‌ నుంచి వేరు చేసింది. వారిద్ద‌రి మైన‌పు బొమ్మ‌ల‌ను హాలీవుడ్ సెల‌బ్రెటీల‌ సెక్ష‌న్‌లోకి మార్చింది. హ్యారీ, మేఘన్‌లు రాజకుటుంబం వదిలి వెళ్లగా.. తమ రెండేళ్ల కుమారుడు ఆర్చీతో కలిసి ప్రస్తుతం కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు.


Next Story

Most Viewed