వాట్సాప్‌లో మనీహీస్ట్ స్టిక్కర్ ప్యాక్

by  |
whats
X

దిశ, ఫీచర్స్ : నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్ సిరీస్ మనీ హీస్ట్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వాట్సాప్ కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను ఇటీవలే విడుదల చేసింది. సిరీస్‌లోని ఫేమస్ డాలీ ఫేస్ మాస్క్‌తో పాటు ప్రొఫెసర్, లిస్బన్ మీటింగ్, టోక్యో, బొగోటా, రియో, స్టాక్‌హోమ్, ఆర్టురో, అలిసియా సియెర్రా, నైరోబి వంటి క్యారెక్టర్స్‌ను ప్రతిబింబించే మొత్తం 17 యానిమేటెడ్ స్టిక్కర్స్ ఉన్నాయి. ముచో పిక్సెల్స్ డిజైన్ చేసిన ఈ ప్యాక్ ఆండ్రాయిడ్, ఐవోఎస్- ఆధారిత యాప్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.

మనీ హీస్ట్ స్టిక్కర్ ప్యాక్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి:
* వాట్సాప్‌లో ఏదైనా చాట్ విండోను ఓపెన్ చేయాలి
* ఆ తర్వాత చాట్ విండో రైట్‌లో ఉన్న స్టిక్కర్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు స్టిక్కర్ స్టోర్‌‌లోని హీస్ట్ యానిమేటెడ్ స్టిక్కర్స్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి
* డౌన్‌లోడ్ బటన్‌ను నొక్కగానే..అవి అందుబాటులోకి వస్తాయి.



Next Story

Most Viewed